తొలి ఏకాదశి విశిష్టత – Toli Ekadashi

  1. Home
  2. chevron_right
  3. Devotional Facts
  4. chevron_right
  5. తొలి ఏకాదశి విశిష్టత – Toli Ekadashi

తొలి ఏకాదశి విశిష్టత – Toli Ekadashi

ఆషాఢ మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని ‘తొలి ఏకాదశి (Toli Ekadashi)’ అని అంటారు. దీనినే ‘శయనఏకాదశి’ అని కూడా పిలుస్తారు. ఇప్పటివరకు ఉత్తర దిక్కుగా ప్రయాణించిన సూర్యుడు, ఈ రోజు మొదలుగా దక్షిణ దిక్కుగా ప్రయాణించడం వల్ల దీనిని దక్షిణాయనంగా పరిగనిస్తారు. చాలా వైష్ణవ దేవాలయాల్లో ఈ రోజున ‘విష్ణు శయనోత్సవం’ జరుపుతారు.

Importance of Toli Ekadashi

ఆదిశేషుని వాహనం గా కలిగిన నారాయణుని లక్ష్మీసమేతంగా పూజ చేయడం వలన సకల శ్రేయస్సు కలుగును. ఈ రోజున ఉపవాసాదులు, విష్ణు సహస్రనామ పారాయణ చేయడం సర్వ శ్రేష్ఠం. ఈ తొలి ఏకాదశి రోజున విష్ణు నామ స్మరణ వల్ల అంత్యమున వైకుంఠప్రాప్తి కూడా కలుగుతుందని పురాణవచనం. ఈ ఏకాదశి నుండి కార్తిక శుద్ధ ఏకాదశి వరకు విష్ణువు యోగనిద్రలో ఉంటాడు. చాతుర్మాస్యం ఈ రోజు నుంచే మొదలగును. కావున ఈ నాలుగు మాసములు ధర్మాచరణ కలిగి విష్ణు ప్రీతికై వ్రతాదులను చేయడం నారాయణ అనుగ్రహాన్ని కలిగిస్తుంది. ఈ నాలుగు మాసములలో వచ్చు ఏకాదశులకు ఇది మొదటిది కనుక దీనికి ‘తొలిఏకాదశి’ అని పేరు.

త్వయి సుప్తే జగన్నాథ జగత్సుప్తం భవేదిదం |
విబుద్ధే త్వయి బుధ్యేత తత్సర్వం స చరాచరమ్ ||

ఏకాదశీ వ్రతం మూడు రోజులు చేయాలి. అంటే రోజూ శేషశాయిని అర్చించడం, ఏకాదశినాడు ఉపవసం, ద్వాదశి పారణ, త్రయోదశినాడు గీత నృత్యాదులతో అర్చన చేయాలి.

ఈరోజు నుండి చాతుర్మాస్య వ్రతారంభం . ఈ వ్రతం చేయాలనుకునేవారు ఈరోజు నుండి కార్తికశుద్ధ ఏకాదశి వరకుగల నాలుగు నెలలపాటు బెల్లం, తైలం విడిచిపెడతామని సంకల్పించుకోవాలి. భగవంతునికి నివేదన చేయని ఆహారం, కాల్చివండినవి, మాంసాహారం, పుచ్చకాయ, గుమ్మడికాయ, చెరకు, కొత్త ఉసిరిక, చింతపండు, మంచంపైన పడుకోవడం, పరాన్నం, తేనె, పొట్లకాయ, ఉలవలు, తెల్ల ఆవాలు, మినుములు, ఈ నాలుగు నెలలు వాడకుండా నియమంగా భగవత్పూజ చేయాలి.

నూతన యజ్ఞోపవీత ధారణ విధానము
శ్రీ సూర్య స్తోత్రము – Surya Stotram

Related Posts