ఉగాది కర్కాటక రాశి ఫలితాలు – Karkataka Rasi Phalalu 2024-25

Loading

ఉగాది కర్కాటక రాశి ఫలితాలు - Karkataka Rasi Phalalu 2024-25

Poojalu. com శ్రేయోభిలాషులకు శుభాభినందనలు. ఇకపై గ్రూప్ ల ద్వారా కాకుండా నేరుగా నిత్య పంచాంగం, పూజా విధానాలు, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మిక సమాచారాలను పొందడానికి ఇప్పుడే మా WhatsApp Channel ను అనుసరించండి.

ఉగాది కర్కాటక రాశి ఫలితాలు 2024-2025

ఈ క్రోధి నామ సంవత్సరంలో కర్కాటక రాశి [Sri Krodhi Nama Samvatsara Karkataka Rasi Phalalu 2024-25] వారి యొక్క రాశి ఫలితాలు, ఆదాయ –  వ్యయములు, రాజపూజ్య – అవమానాలు, దోష సమయాలు, అనుకూలించే శుభసమయాలు, స్త్రీలకు ప్రత్యేకించి కలిసివచ్చే అంశాలు, చేసుకోవలసిన శాంతులు, నెలవారీగా ఉండేటువంటి శుభ విశేషాలు సంపూర్ణంగా ఇవ్వబడ్డాయి.

  • ఆదాయం – 14, వ్యయం – 02
  • రాజపూజ్యం – 06, అవమానం – 06

ఎవరెవరు కర్కాటక రాశి లోకి వస్తారు?

సాధారణంగా కింది నక్షత్రాలలో జన్మించిన వారు లేదా, కింది అక్షరాలను వారి పేర్లలో మొదటి అక్షరం గా కలిగిన వారు కర్కాటక రాశి లోకి వస్తారు.

  • పునర్వసు 4వ పాదము (హి)
  • పుష్యమి 1, 2, 3, 4 పాదములు (హు, హె, హో, డా)
  • ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు (డీ, డు, డే, డో)

శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది కర్కాటక రాశి ఫలాలు [Karkataka Rasi Phalalu 2024-25] ఈ కింది విధంగా ఉన్నాయి.

కర్కాటక రాశి ఫలాలు 2024-25

ఈ రాశి వారికి ఈ సంవత్సరములోగ్రహముల దోషకాలములు

  • రవి : 15-6-2024 నుండి 16-8-2024 వరకు ద్వాదశం, జన్మం,18-10-2024 నుండి 16-11-2024 వరకు అర్ధాష్టమం, 13-2-2025 నుండి 14-3-2025 వరకు అష్టమం.
  • కుజుడు : 26-8-2024 నుండి సం||రం అంతా ద్వాదశం, జన్మం.
  • గురుడు: ఈ సం||రం శుభుడే,
  • శని : ఈ సం||రం అష్టమం,
  • రాహు, కేతువులు: ఈ సం||రం శుభుడే.

ఈ రాశి స్త్రీ పురుషాదులకు ధనము, విద్య సంపత్తు, బుద్ధి, సంతానమునకు కారుకుడైన గురుడు మంచిస్థానములందుండుట చేత ఎలాంటి కష్ట సాధ్యమైన పనులైనా సాధించగలరు. వ్యక్తిగతంగాను సాంఘికంగా గౌరవ ప్రతిష్టలు పెరు గును, మీలోగల శక్తి సామర్థ్యములు హెచ్చి, అధికార వర్గముగా ఉపకార లాభ ములు కలుగును. గృహ నిర్మాణాది పనులు కలసివచ్చును. మీ జీవన మార్పులు వలన సంఘంలో గౌరవము, మంచి ఫలితాలు ఇచ్చును. నూతన ప్రయత్నములు ఫలించును, బంధువర్గములో మీ ప్రాముఖ్యత హెచ్చును. అన్నిరంగాల వార్కి జీవన వృద్ధి, రాజపూజ్యత హెచ్చును, కుటుంబ ఔన్నత్యము, చిత్ర విచిత్ర వస్తు వస్త్ర మూలక ధనవ్యయం కలుగును. తలవని తలంపుగా అభివృద్ధిలోమార్పులు జరుగును. అష్టమశనివల్ల స్వల్పంగా అనారోగ్యం, రక్తమార్పు, ధాతుబలం తగ్గుట, కళత్రవంశ పీడలు కలుగును, వాహనప్రమాదములు గాన జాగ్రత్తగా, ఆచితూచి ప్రయాణములు చేయవలెను. సోదర సోదరీలు అనుకూలత, పెద్దల అనుగ్రహం, స్త్రీ సహాయం, నూతన బాంధవ్యములు, జీవనరంగములో ఆధిక్యత, గృహంలో వివాహాది శుభకార్యములు, భూగృహాదులు కొనుట లేదా పాత గృహములో మార్పులు, నూతనవృత్తులు, వ్యాపార వ్యవహారాలలో అభివృద్ధి, గుప్తస్త్రీ సమా వేశములు, వినోద విహారాదులు కలుగును. పుణ్యక్షేత్ర సందర్శనములు, మనః శ్శాంతి కలుగును. గతంలో ఎడబాటుగా ఉన్న భార్యాభర్తలు కలుసు కుంటారు.

ఆనందమైన జీవనం. దాంపత్య సౌఖ్యం అనుభవించగలరు. ధైర్యంతో ఉంటారు. ఈసం||రం ఉద్యోగులకు మంచియోగదాయకమైనకాలమే. కేంద్రరాష్ట్రప్రభుత్వ ములందు పనిచేయు వారలకు ప్రమోషన్తో కూడిన బదిలీలు, ఇంక్రిమెంట్లు పెరుగుట, అధికారుల మన్ననలు, ప్రత్యేకగుర్తింపు. చిన్న, పెద్ద, అందరికి కూడా లాభమే. గృహనిర్మాణాలు చేయుదురు. పర్మినెంటుకానివార్కి పర్మినెంటు అగును. నిరుద్యోగులకు ఈసం॥రంఉద్యోగంలభించి జీవితంలో స్థిరత్వం పొందగలరు. ప్రైవేటుసంస్థలలో పనిచేయువార్కి యజమానులగుర్తింపు లభించి ఉన్నతస్థితి. రాజకీయ నాయకులకు మంచికాలమే. ప్రజలతోసఖ్యత, మంచిపేరు, అధిష్ఠా నంలోకూడా ప్రత్యేకగుర్తింపు, పార్టీలోమంచి పదవులు లభించును. ఎన్నిక లలో సీట్లు పొంది తప్పకవిజయం సాధించెదరు. ఆర్ధికంగా నిలద్రొక్కుకున్ననూ అధిక ధనవ్యయము. గ్రామములలో అనేక నూతన కార్యక్రమములు నిర్వహిస్తారు.

కళాకారులకుకూడా మంచికాలమే. గురుప్రభావంవల్ల నూతన అవకాశాలు బాగావచ్చును. ఇండస్ట్రీలోనిలద్రొక్కు కుంటారు. నటీనటవర్గం, గాయనీ గాయ కులు, టి.వి సినిమా రంగంలో ఉన్న సాంకేతిక నిపుణులకు “వారు చేసే పనులు విజయవంతమై ప్రత్యేక గుర్తింపు. ప్రభుత్వ ప్రైవేటు సంస్థల అవార్డులు లభించును. అన్నిరకాలవ్యాపారస్థులకు లాభదాయకమైన కాలం. ఆశించిన లాభములు పొందగలరు. నూతనవ్యాపారములు ప్రారంభిస్తారు. హోల్సేల్ మరియు రిటైల్ రంగంలోవార్మియోగమే. సరుకులు నిల్వచేయువారికి మంచి లాభములు వచ్చును. షేర్ మార్కెట్లో ఉన్న వార్కి గత సంవత్సరం కంటే బాగుండును. జాయింటు వ్యాపారస్థులకు, భాగస్వాములతో సఖ్యతవల్ల రాణింపు ఉంటుంది. స్థిరాస్తివృద్ది.
ఈ సం॥రం విద్యార్ధులకు గురుబలం వల్ల జ్ఞాపకశక్తి, పెరిగి ఉన్నత విద్య లభించును. మంచిమార్కులతో ఉత్తీర్ణులగుదురు. విద్యలపై ఆశక్తి, చెడు స్నేహాలకు అలవాటు పడక చదువులందు రాణింతురు. ఇంజనీరింగ్, మెడికల్, ఇసెట్, ఆసెట్, ఐసెట్,బి.ఇడి. మొ||గు ఎంట్రన్సు పరీక్షలందు మంచి ర్యాంకులు పొంది కోరుకున్నచోట్లసీట్లుపొందగలరు. జాతీయ అంతర్జాతీయజట్లలోస్థానంపొందగలరు. వ్యవసాయదారులకు రెండు పంటలు బాగా ఫలించును. మంచి ఆదాయం పొందగలరు. ఋణములు తీర్చివేయుదురు. గృహములో శుభకార్యములు జరుగును. కౌలుదార్లకు లాభములు వచ్చును. చేపలు, రొయ్యలు చెరువుల వార్కి గత సం||రం కంటే అధిక ఆదాయం లభించును. పౌల్ట్రీ వార్కి కూడా లాభమే.

స్త్రీలకు:- గురుబలంవల్ల పట్టిందల్లాబంగారమా? అనునట్లుండును. కుటుంబంలో అందరూ మీ మాట ప్రకారం నడుచుకుంటారు. మీ పేరు తో ఆస్తులు, విలువైన వస్తువులు లభించును. భార్యాభర్తలు మధ్య సరైన అవగాహనతో నగాహనతో సుఖమైన జీవనం పొందుదురు. సంతానం వలన సౌఖ్యం, శుభకార్యాలు చేయుదురు. ఉద్యోగంచేయుచున్నవార్కి ప్రమోషన్తో కూడినబదిలీలు. అధికారుల అనుగ్రహం, శ్రమకు తగిన గుర్తింపు లభించును. గర్భిణీస్త్రీలకు శస్త్ర చికిత్స ద్వారా డెలివరీ. పుత్ర సంతాన ప్రాప్తి, వివాహం కాని స్త్రీలకు ఈ సం॥రం వివాహం జరుగును. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు మంచి యోగదాయకమైన కాలం. ఊహించని విధంగా జీవిస్తారు. ప్రతిఒక్కరిదృష్టి మీపైఉంటుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా సుఖవంతమైనజీవనంలభించును. మీ యొక్కశక్తి సామర్థ్యాలు అందరికి తెలిసి పేరుప్రఖ్యాతులుపొందగలరు. అష్టమశని ప్రభావం స్వల్పంగా ఉంటుంది.

చేయవలసిన శాంతులు:-
ఈ సం||రం నరఘోష ఎక్కువ. కనుక మంగళ,శనివార నియమాలు పాటించి, శివాలయాలలో రుద్రాభిషేకం, శ్రీశైలక్షేత్ర సందర్శన కూడా మంచిది. నరఘోష, శనిగ్రహశాంతి యంత్రాలు ధరించిన మంచిది.

ఏప్రియల్:- అన్నిరంగాలవారికి రాణింపు ఉంటుంది. నూతనకార్యాలకు శ్రీకారం చుట్టెదరు. వృత్తివ్యాపారాలు అనుకూలించును. ఆదాయంబాగుంటుంది. ఆరోగ్య లాభం, పరాక్రమంతో పనులు చేస్తారు. బంధుమిత్రుల సహాయ సహకారములు లాభించును. సంతాన సౌఖ్యం. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది. నికిపూర్తిచేస్తారు. కోర్టువ్యవ కోర్టువ్యవహారాదులందుజయం. ఇతరులకు సహాయ పడుదురు. శత్రువుల పై ఆధిక్యత. నూతనపరిచయాదులువల్లలాభాలు, ప్రయాణాదులు వల్ల లాభాలు, స్పెక్యులేషన్ లాభములు కలుగును. ప్రయాణాలందు ఇబ్బందులు.
మే:-చేయువృత్తి వ్యాపారాలందుఅనుకూలత, అనుకున్నపనులు సరైన సమయా

జూన్ :- ఈనెలలో మిశ్రమఫలితాలు, ప్రథమార్ధంలో అన్నివిధాలుగాబాగుండును. ద్వితీయార్థంలో కొంత ఇబ్బంది తప్పదు. పనులు కొన్ని నిలచిపోవును. ఆదాయ మునకు మించిన ఖర్చులు చేయుదురు. ఆరోగ్యభంగాలుతప్పవు. సంతాన పీడలు, సూతకములు, బంధుమిత్రులతో విరోధములు, ఊహించని సమస్యలు ఏర్పడును.

జూలై :- చేయువృత్తివ్యాపారాలు అంతంతమాత్రమే. మనోదుఃఖములు, పను లందుఆటంకాలు, శారీరకశ్రమ, అశాంతి, అకాలభోజనాలు, దుస్సంఘటనలు, మాట్లాడితే విరోధాలు, కుటుంబంలో వ్యతిరేకత, భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు, సంఘంలో మీ పేరు దిగజారును. భూసంబంధ వ్యవహారాలు నష్టం.

ఆగష్టు :- అన్నివిధాలుగాబాగుండును. చేయువృత్తివ్యాపారాలందుఅనుకూలత. ఆదాయం వృద్ధి, ఉద్యోగులకు ప్రమోషన్తోకూడిన బదిలీలు, పై అధికారుల అనుగ్రహం, దైవసంబంధకార్యాలుచేయుట, సంతోషవార్తలువినుట, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. నూతన పరిచయాలు లాభించును. కుటుంబ సౌఖ్యం, సంతాన సౌఖ్యం, స్త్రీ మూలక ధనలాభములు, స్పెక్యులేషన్లో అనుకూలత.

సెప్టెంబర్:- గ్రహాల అనుకూల సంచారంవల్ల మనోల్లాసం, దూరప్రయాణాలు, పుణ్యనదీస్నానములు, దైవదర్శనములు, రావలసిన బాకీలు వసూలగుట, వృత్తి వ్యాపారములందు అనుకూలత, శత్రువులపై ఆధిక్యత, స్నేహితులతో కలయిక, కుటుంబంలో మీ మాట పైచేయి, స్పెక్యులేషన్లో లాభములు చేకూరును, అపకీర్తి.

అక్టోబర్:- అన్నిరంగాలవార్కి అన్నివిధాలుగా బాగుంటుంది. ఆరోగ్యం కుదుటప డును. ధనాదాయం సంతృప్తి, ధైర్యంగా పనులు చేయుదురు. మధ్యవర్తిత్వంలో రాణింపుఉంటుంది. వాహనసౌఖ్యం, కుటుంబవ్యక్తులు సహకరించెదరు. శత్రు జయం, నూతనవస్తు, వస్త్రప్రాప్తి, విలువైనవస్తువులుకొంటారు. స్పెక్యులేషన్ లాభం.

నవంబర్:- ప్రతీ విషయంలో దూకుడుగా, దురుసుగా కోపంగా ప్రవర్తించుట, పరుషంగా మాట్లాడుట వలన కొన్నికార్యక్రమాలు మధ్యలో నిలచిపోయిననూ, చివరకు మీకు అనుకూలంగాపూర్తి అగును. భార్యాభర్తలమధ్య విభేదములుతప్పవు. సంతానసౌఖ్యం, నూతనపరిచయాలులాభించును. నమ్మినవారివల్లదగాపడుదురు.

డిశంబర్:- ఈనెలలో గ్రహసంచారంఅనుకూలం. అన్నిరంగాలవార్కి బాగుం టుంది. వ్యాపారాలు అనుకూలించును. వ్యవహారజయం. ఆరోగ్యలాభం, ధనము నకు లోటుండదు. ఉత్సాహం. హుషారుగా ఉంటారు. వాహనమార్పులు. సంఘంలో ఉన్నత స్థితి, సంతానసౌఖ్యం, భార్యాభర్తల మధ్య సరైన అవగాహనఉంటుంది.

జనవరి :- ఈనెలలో శుభాశుభమిశ్రమంగా ఉండును. ప్రథమార్గం బాగుండదు. పనులయందు ఆటంకాలు, సమస్యలలోచిక్కుకొనుట, ఊహించని పరిణామాలు, అపవాదులు, అనారోగ్యం, శరీరగాయాలు, సోదరులతో విరోధాలు, ద్వితీయా ర్ధంలో అనుకూలత, బంధుమిత్ర సమాగమము, నూతన వస్తు, వస్త్ర లాభములు.

ఫిబ్రవరి :- ఈనెలలో కూడా మిశ్రమ ఫలితాలే ఉండును. ఆరోగ్య రీత్యా ఇబ్బం దులు తప్పవు. శిరో, నేత్రపీడలు, ఊహించని పరిణామాలు, ఆందోళన కల్గించు సంఘటనలు, స్థానమార్పులులేదా గృహమార్పులు, వివాహాది శుభకార్యములకు హాజరగుట, దూరపు బంధువులను కలుసుకొనుట, స్పెక్యులేషన్లో నష్టములు.

మార్చి:- అనుకూల గ్రహ సంచారం లాభించును. చేయు వృత్తి వ్యాపారాలందు అనుకూలత, ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థిక లావాదేవీలు సంతృప్తి, ఉత్సాహంగా, ధైర్యంతో ముందుకు పోగలరు. గృహ నిర్మాణ పనులు కలసివచ్చును. సంతాన నష్టం, శత్రుజయం, స్త్రీసౌఖ్యం, సంఘంలో పెద్దవారిని కలుసుకొంటారు. ప్రయాణ లాభం, నూతన పరిచయలాభం, స్పెక్యులేషన్ లాభించును. సంతానం సౌఖ్యం.