ధనుస్సు రాశి ఫలితములు 2021-2022

శ్రీ ప్లవ నామ సంవత్సరం లో ధను రాశి వారికి [Sri Plava Nama Samvatsara Dhanu Rasi Phalitalu 2021-2022] ఆదాయం – 11, వ్యయం – 05 :: రాజపూజ్యం – 07, అవమానం – 05 గా ఉన్నాయి. సాధారణంగా మూల 4 పాదములు (యె, యో, బ, బి) పూర్వాషాఢ 4 పాదములు (బు, ధ, భ, ఢ) ఉత్తరాషాఢ 1వ పాదం (బె) వారు ధనుస్సు రాశి లోకి వస్తారు. శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది ధను రాశి ఫలాలు [Dhanu Rasi Phalalu 2021] ఈ వీడియో లో వివరంగా గమనించగలరు.

రవి  : 13-4-2024 వరకు అర్ధాష్టమం . 17-7-2024 నుండి 16-8-2024 వరకు అష్టమం. 17-11-2024 నుండి 13-1-2025 వరకు ద్వాదశం, జన్మం. 15-3-2025 నుండి ఆఖరకు అర్ధాష్టమం . కుజుడు : 23-4-2024 నుండి 1-6-2024 వరకు అర్ధాష్టమం . 19-10-2024 నుండి 8-2-2025 వరకు అష్టమం. తిరిగి 28-3-2025 నుండి ఆఖరు వరకు అష్టమం. గురుడు : ఈ సం॥ శుభుడే. శని : ఈ సంబరం శుభుడే. రాహువు : ఈ సం॥రం అర్దాష్టమం. కేతువు : ఈ సం॥రం శుభుడే.

ఈ రాశి స్త్రీ పురుషాదులకు గురుడు 6 వ స్థానంలో, రాహువు, కేతువులు 4,10 స్థానంలో ఉండుటచేతను, శని స్థితి యోగించును. అన్నిరంగాలా తమ జీవితమునకు విలువతెచ్చుకుంటారు. అధికారవర్గంలో మీ స్వయం ప్రతిభచే కార్యదీక్ష, సంఘంలో గౌరవం, పలుకుబడి కలుగును. పుణ్యక్షేత్ర సందర్శనం చేయుదురు. ధైర్యసాహసాలుపెరుగుట, కొన్నిశక్తులుసమకూరుటవల్ల ఆత్మీయతను పెంపొందించుట సంఘంలోమంచిస్థానం. బంధుమిత్రులవల్ల ఆదరణ పెరుగును. మీయొక్క తెలివితేటలను అందరుగుర్తించెదరు. మీరు చేయు పనులకు, గృహ జీవితములో నరఘోష ఎక్కువ. ఎంతటి ధనవ్యయముకైనా లెక్కచేయక విజయము సాధించుట, స్వవిషయంలోకంటే ఇతరులవిషయంలో శ్రద్ధఎక్కువ. మీ వాక్ర భావం గొప్పది. మీరు మాట్లాడే మాటలు అందరకు రుచించును. ప్రతీ పనిలోనూ ముందడుగు వేయుదురు. కుటుంబ సమస్యలు తప్పవు. కుటుంబ వ్యక్తులువలన ధనవ్యయం తప్పదు. శారీరకంగా ఒక్కోసారి చిన్న చిన్న రుగ్మతలు మూలకంగా ధనవ్యయం తప్పదు. సోదరులనుకునేవారివల్ల ధననష్టం. ఊహించని సమస్యలలో ఇరుక్కొనుట, గురుబలం వలన వాటి నుండి బయటపడుదురు. ప్రతీ విషయంలో చిన్న చిన్న ఒడిదుడుకులు ఉన్ననూ చివరకు అపకారం, ఉపకార చును. కుటుంబసమస్యలువల్ల ప్రతీచిన్న విషయాన్ని గమనించి మ

ఈ సం||రం ఉద్యోగులకు అన్నివిధములుగా బాగుంటుంది. శ్రమకు తగిన గుర్తింపు ఉంటుంది. ఆదాయంఎంతవచ్చినా మంచినీళ్ళవలెఖర్చుగును. కుటుంబ సమస్యలుంటాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వములలో ఉన్నవార్కి ప్రమోషన్స్ తప్పక లభించును. అయితే కుటుంబంనకు దూరంగా ఉండవలసి వచ్చును. గృహనిర్మా ణం చేయుదురు. నిరుద్యోగులుఈ సం॥రం తప్పకఉద్యోగంపొందగలరు. ప్రవేటు కంపెనీలలో పనిచేయువారికి గుర్తింపు వచ్చును. ఆదాయం కొరకు ఇతర కంపెనీలకు మారుదురు. పర్మినెంటుకాని వార్కి ఈ సం||రం పర్మినెంట్ అగును.

రాజకీయ నాయక్తులకు మహోన్నతకాలంగా ఉండును. ప్రజలలో మంచి పేరుఉండును. అనేక సేవాకార్యక్రమాలుచేయుట వల్ల పార్టీలోనూ, అధిస్థానంలో ప్రత్యేకత సంపాదించుకొంటారు. ప్రభుత్వ సంబంధం లేదా పార్టీలో నైనా ఏదో ఒక పదవి తప్పకలభించును. ఎన్నికలందు పోటీచేసిన విజయము సాధిస్తారు.

కళాకారులకు ఈ సం॥రం కొంతమేర అనుకూలించును. అవకాశములు వచ్చినా ఆదాయం అంతంతమాత్రమే. టి.వి సినిమాలలో ఉన్న గాయనీ గాయకులు, నటీనటవర్గం, ఇతర సాంకేతిక నిపుణులకు మంచి విజయాలు లభించుటచే పేరు ప్రఖ్యాతలు పెరుగును. ప్రభుత్వ మరియు ప్రైవేటు సంస్థల అవార్డులు తప్పక వచ్చును. ఆదాయం బాగుండినా ఖర్చులు అధికంగా ఉండును.

వ్యాపారస్తులకు ఈ సం॥రం అనుకూలమే. అన్నిరకాల వ్యాపారాలు బాగా సాగును. హోల్ సేల్మరియు రిటైల్ వ్యాపారులకు ఆదాయం బాగుండినా ప్రభుత్వ సంబంధ దాడులు ఎక్కువగా ఉంటాయి. ఆదాయపన్నువారి స్క్రూట్నీలు తప్పవు. బిల్డింగ్ నిర్మాణ పనులుచేయు వార్కి లాభమే. కాంట్రాక్టు దారులకు నూతన కాంట్రాక్టులువచ్చును. షేర్ మార్కెట్లో ఉన్న వార్కి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఒక్కసారి విపరీత నష్టములు వచ్చినా చివరకు పుంజుకోగలరు. జాయింటు వ్యాపారంచేయువారికి భాగస్వాములతో సఖ్యత. ధనలాభముఇనుము, స్టీలు, ఇసుక, కంకర వ్యాపారస్తులకు అనుకూలతతక్కువ. సరుకులు నిల్వచేయువారికి లాభం.

విద్యార్ధులకు ఈ సం॥రం గురుబలం బాగున్నది. మంచి జ్ఞాపకశక్తి వలన మంచి మార్కులతో ఉత్తీర్ణులగుదురు. విదేశీ చదువులు లాభించును. ఇంజనీ రింగ్, మెడికల్, లాసెట్, ఆసెట్, ఐసెట్, ఈసెట్, బి.ఇడి, పాలిటెక్నిక్ మొ||లగు ఎంట్రన్సు పరీక్షలు వ్రాయువారు మంచి ర్యాంకులు పొంది కోరుకున్న కాలేజీలకు సీట్లునుపొందగలరు. క్రీడాకారులకుఅనుకూలమే. అనేక విజయాలు లభించును.

వ్యవసాయదారులకు కూడా అనుకూలమే. రెండు పంటలు మంచి దిగుబడి వలన ఆదాయం బాగుండును. ఋణములు తీరిపోవును. కౌలుదార్లకు విశేష ఫలితాలు ఉంటాయి. చేపలు, రొయ్యల చెరువులు వార్కి గత సంవత్సరము కంటే బాగుండును. ఆదాయం తగ్గును. పౌల్ట్రీలకు ఆర్ధికంగా బాగానే ఉండును.

స్త్రీలకు:- ఈ సం||రం గురుబలంవల్ల మీమాటకు విలువ పెరుగును. మీ పేరుతో స్థిరాస్తులు, విలువైనవస్తువులుకొంటారు. మీచేతికి ఎంతధనం వచ్చినా నిముషాలలో ఖర్చుగును. ఉద్యోగస్తులకు ప్రమోషన్తోకూడిన బదిలీలు. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన, విడిపోయిన భార్యాభర్తలు కలుసుకుంటారు. గర్భిణీస్త్రీలకు ఫ్రీడెలివరీ. పుత్రసంతానప్రాప్తి. వివాహం కాని స్త్రీలకు తప్పక వివాహం జరుగును. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు గురు, రాహువులు ప్రభావం వల్ల శనిప్రభావం వల్ల జీవన సౌఖ్యం, కొంతమేర జాగ్రత్త అవసరం. ఆందోళనలు.

చేయవలసిన శాంతులు:- నరఘోష అధికం, మంగళవార నియమాలు పాటించి, శివాలయాలలో తైలాభిషేకం చేయవలెను. శ్రీశైల క్షేత్ర సందర్శనం చేయాలి. శివదీక్ష తీసుకోండి. నరఘోష,నవగ్రహశాంతియంత్రాలు ధరించిన మంచిది.

ఏప్రియల్ :- అన్నిరంగముల వార్కి యోగమే. చేయువృత్తివ్యాపారములందు రాణింపు,ఆరోగ్యలాభం, ఆదాయంనకు లోటుండదు. వ్యవహారానుకూలత, ఉల్లా సంగాఉంటారు.వాహనసౌఖ్యం, సంతానసౌఖ్యం, శత్రుజయం, భార్యాభర్తల మధ్య సరైన అవగాహన, విందులు, వినోదాలు, సంఘంలో పెద్దవారిని కలుసుకుంటారు.

మే :- ఆర్దికంగాబాగుండును. అనుకున్నపనులు సాధించెదరు. గృహంలో వివాహాది శుభకార్యములు, బంధుమిత్రులతో కలయిక సమస్యలనుండి బయటకు వస్తారు. ప్రయాణలాభాలు, నూతన వస్తు, వస్త్ర ప్రాప్తి, స్త్రీలతో మాత్రం మాటా మాటా పట్టింపులు తప్పవు. స్పెక్యులేషలో బాగుండును. గృహంలో మార్పులు చేయుట

జూన్ :-అన్నివిధాలుగా బాగుందును. ఆదాయంసకుమించిన ఖర్చులు, ఋణాలు చేయవలసి వచ్చును. ఎలక్ట్రానికవస్తువులు (సెల్ఫోన్) పోగొట్టుకొంటారు. సోదరు లతో చిన్న చిన్న తగాదాలు, పితృవంశ సూతకములు, పరామర్శలు చేయుదురు, మిత్రులతో కలసి విందులు, వినోదములు, స్పెక్యులేషన్లో స్వల్పంగా నష్టములు,

జూలై:-గ్రహసంచారం అనుకూలంగా లేనందువల్ల అనేక ఇబ్బందులుకలుగును. ఆరోగ్యభంగాలు, శారీరకశ్రమ, అలసట, ఏపనికలసిరాదు, చిన్నవారితోకూడామాటలు పడుట, బంధుమిత్రవిరోధాలు, కుటుంబకలహాలు, అపనిందలు, అపవాదులు, ధననష్టం, వ్యవహారభంగాలు సమస్యలు వల్ల నష్టాలు స్పెక్యులేషన్లో భారీగానష్టాలు,

ఆగష్టు:- అన్నింటాజయం, ఆరోగ్యంబాగుండును. ఆర్ధికలావాదేవీలు సంతృప్తి, ధైర్యంగావ్యవహరిస్తారు. గతంలో ఏర్పడినసమస్యలుతొలగును, ప్రయాణాలుచేస్తారు. శుభకార్యాలకు హాజరగుదురు. ఊహించని ఖర్చులు, అప్రయత్నంగా ధననష్టాలు, స్నేహితులతో దుబారాలు చేయుట, స్పెక్యులేషన్లో మాత్రం మిశ్రమఫలితాలు,

సెప్టెంబర్:- అన్నిరంగాలవార్కి చేయునవృత్తివ్యాపారాలందురాణింపు ఉంటుంది. హుషారుగా, స్వల్పకోపంతో ఉంటారు. ప్రతీ చిన్న విషయానికి ఉద్రేకపడుట వలన అనవసర గొడవలు సంభవించును. మధ్యవర్తిత్వం చేయుదురు. ఆదాయం నకు లోటుండదు. సంతానం ద్వారా బాగుండును. స్పెక్యులేషన్లో అనుకూలత,

అక్టోబర్ :- ఈ నెలలో అంతగా బాగుండదు. ఆదాయంనకు మించిన ఖర్చులు. స్త్రీమూలకధనవ్యయం. ఊహించనిసమస్యలు ఎదుర్కొంటారు. అనవసరంగా కొన్ని పనులుచేయుటవల్లఇబ్బందులుకొనితెచ్చుకొంటారు. కుటుంబకలహాలు, భార్యా భర్తలమధ్యస్వల్పంగా విరోధాలు, మనఃశ్శాంతి ఉండదు. స్పెక్యులేషన్లోనష్టములు.

నవంబర్:- ఈనెలలోకూడా పరిస్థితులు అంతంతమాత్రమేఉంటాయి. కొన్ని సమస్యలుతీవ్రమగును. ఏపని చేయబుద్దికాదు. ప్రతీవిషయంలో మీకు వ్యతిరేకత. అనవసరఖర్చులు,ఆరోగ్యభంగాలు, నేత్ర, శిరోబాధలు, సంతానంద్వారా ఇబ్బందులు స్త్రీసౌఖ్యం ఉంటుంది. తీర్ధయాత్రా ఫలప్రాప్తి. స్పెక్యులేషన్లో భారీగా నష్టములు.

డిశంబర్:- ఈనెలలో అందరికీ బాగుండును. వృత్తివ్యాపారాలందు రాణింపు. ఆర్ధిక లావాదేవీలు సంతృప్తి, పనులు పూర్తి అగుట, సమస్యలు తీరును ఆరోగ్యం బాగుండును. మిత్రులసహకారంలభించును. వాహన మార్పులు. సంతానసౌఖ్యం, శత్రువులపైజయం, భార్యతోసఖ్యత, ప్రయాణలాభాలు, పితృవంశీకులతోకలయిక.

జనవరి :- ప్రతిపనిలో ఉత్సాహంగా ఉంటారు. నూతన వాహన, వస్తు, వస్త్రప్రాప్తి, దూర ప్రయాణాలు చేయుట, బంధుమిత్రులతో కలయిక సంతోషంగా ఉండుట, సమస్యలు పరిష్కారమగును. నూతన పరిచయాలు లాభించును. వ్యవహార జయం, శత్రువులే మిత్రులగుట, స్త్రీ సౌఖ్యం, స్పెక్యులేషన్లో కొంత అనుకూలత.

ఫిబ్రవరి :- కార్యాలు సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. గృహనిర్మాణాలు కలసి వచ్చును. గృహములో రజస్వలవంటి శుభకార్యాలు జరుగును. బంధుమిత్రుల కలయిక, కుటుంబ సౌఖ్యం, సంతాన సౌఖ్యం, ఆరోగ్యం బాగుండును. గతంలో నిలచిపోయిన పనులుపూర్తి అగుట, ఆకస్మికంగా కొన్ని సమస్యలు వచ్చును. స్పెక్యులేషన్లో అనుకూలతలాభములు. అన్నిరంగాలవార్కి ఆర్ధికంగా బాగుండును.

మార్చి :- చేయు వృత్తివ్యాపారములందు అనుకూలం. అన్నింటా జయం, ఆరోగ్యం బాగుండును. ఆర్థికంగా సంతృప్తి, ధైర్యంగా ముందుకు పోగలరు. ఇష్టమైన వ్యక్తులను కలుస్తారు. ఉద్యోగులకు గృహ మార్పులు స్థాన మార్పులు తప్పవు. విద్యార్ధులకు అనుకూలమే. నూతన పరిచయలాభములు, స్పెక్యులేషన్ బాగుండును. గతంలో నిలిచిపోయిన పనులు పూర్తిచేస్తారు. ఆర్థికలాభములు.

శ్రీ ప్లవ నామ సంవత్సర రాశి ఫలితాలు 2021

This content is Copyrighted, and not allowed to copy!