మిధున రాశి ఫలితములు 2021-2022

శ్రీ ప్లవ నామ సంవత్సరం లో మిధున రాశి వారికి [Sri Plava Nama Samvatsara Mithuna Rasi Phalalu 2021-2022] ఆదాయం – 05, వ్యయం – 05 & రాజపూజ్యం – 03, అవమానం – 06 గా ఉన్నాయి. సాధారణంగా కృత్తిక 2,3,4 పాదములు (ఈ,ఊ,ఏ) రోహిణి 1,2,3,4 పాదములు,(ఓ,వా,వీ,వూ), మృగశిర 1,2 (వే,వో) పాదముల వారు మిధునరాశి లోకి వస్తారు. శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది మిధునరాశి ఫలాలు [Mithuna Rasi Phalalu 2021] ఈ వీడియో లో వివరంగా గమనించగలరు.

ఈ రాశి వారికి ఈ సంవత్సరములో గ్రహములదోషకాలములు

రవి 15-5-2024 నుండి 16-7-2024 వరకు ద్వాదశం,జన్మం . 17-9-2024 నుండి 17-10-2024 వరకు అర్ధాష్టమం . 15-1-2025 నుండి 12-2-2025 వరకు అష్టమం. కుజుడు : 13-7-2024 నుండి 19-10-2024 వరకు ద్వాదశం జన్మం. 9-2-2025 నుండి 28-3-2025 వరకు జన్మం. గురుడు ఈ సం॥రం అంతా ద్వాదశం, శని : ఈ సం||రం శుభుడే. రాహువు, కేతువులు: ఈ సం॥రం శుభులే.

ఈ రాశి వార్కి బుద్ధి, ధనము, కుటుంబ కారకుడైన గురుడు, బలీయంగా ఉండుట, శని, రాహువులు కూడా బలంగా యుండుటచే ఉన్నతస్థితికి రాగలరు. యోగ ప్రభావం హెచ్చును. ధనాదాయం చాలాబాగుండును. భార్యాభర్తలు కలిసి ఏ పని చేసినా, ఏ వ్యాపారం తలపెట్టినా విజయం నూతన గృహలాభములు, కట్టడాలు, గృహంలో వివాహాది శుభకార్యాలు ఆనందంగా జరుగును. నూతన బాంధవ్యాలు, పుణ్యక్షేత్రాలకువెళ్ళుట, వాహనలాభం, మీతెలివితేటల ప్రభావంచేత ఎంతటివారినైనా లోబరుచుకొనుట కలుగును. గత సంవత్సరం కంటే విశేష యోగం అనుభవిస్తారు. విలాసవంతమైన జీవనం కలుగును. తోడు లేకుండా ఏ పని కలసిరాదు. స్త్రీ ప్రమేయంతో ఎంతటి ఘనకార్యమైన సాధిస్తారు. లోగడ చేసిన ఋణబాధలుతొలగును. శనిబలంవల్ల ఎంతటి కార్యాన్నైనా సాధించగలరు. చేయు కృషి, వ్యవహారాలలోమార్పులు, క్రమేపి శరీరఆరోగ్యం అంతరించుట స్త్రీ జనమూలక సంతోషం. కుటుంబ సంరక్షణ, నూతన కార్యప్రారంభములు, బంధువర్గంలో మీ ప్రాముఖ్యత పెరుగును. స్థిరాస్థిలో మార్పులు భూగృహాదులు వలన తగిన ఆదాయం చేకూరును. అప్రయత్న ధీనలాభములు, రెండు మూడు విధములైన ఆదాయం కలుగును. సాంఘిక సేవా కార్యములు చేయుదురు.

ఈ సం||రం ఉద్యోగులకు అనుకూలమైన కాలం. శ్రమకు తగిన ఫలితం పొందగలరు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వములందు పనిచేయువారికి కావలసిన చోట్లకు బదిలీ జరిగి అధికారుల మన్ననలు పొందగలరు. సౌఖ్యమైన జీవనం. ప్రమోషన్తో కూడిన బదిలీలు అందరిమెప్పును పొందగలరు. నిరుద్యోగులకు ఈసం||రం మంచి ఉద్యోగంలభించి జీవితంలో స్థిరత్వం పొందగలరు. పర్మినెంటు కాని వారికి ఈ సం||రం తప్పకుండా పర్మినెంటుఅగును. ప్రవేటుకంపెనీలందు పనిచేయు వారికి యజమాని యొక్క మన్ననలు పొంది జీతములు పెరుగును.
రాజకీయనాయకులకు శనిబలం వల్ల ప్రజలలో మంచి గుర్తింపు లభించును. ఏదోఒకనామినేటడ్పదవి. లేదాపార్టీపదవైనాలభించును. అధికారులతో మంచి సంబంధాలు. ఎన్నికలలో తప్పక విజయం సాధించగలరు. పార్టీలోని వారందరు మిమ్మల్నిగౌరవిస్తారు. ప్రజాసమస్యలుపరిష్కరించి మంచి పేరుప్రఖ్యాతులు పొంద గలరు. శ్రమకు తగ్గ ఫలం లభించును. ధనము మంచినీళ్ళవలె ఖర్చుఅగును.

ఈ సం॥రం కళాకారులకు మధ్యస్తంగా ఉంటుంది. కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్ననూ ఆదాయంసకులోటుండదు. నూతన అవకాశాలు వచ్చినట్టివచ్చి చేజారిపోవును, టిని సినిమారంగాల లందు, గాయనీ, గాయకులు, నటీనటవర్గం, సాంకేతిక నిపుణులకు నుంచి అవకాశాలు, నూతన గృహనిర్మాణంచేయుదురు. ఈసం||రం విద్యార్థులకు జ్ఞాపకశక్తి తగ్గును, చదువులపైశ్రద్ధ, కష్టపడుటచే మంచి మార్కులు సాధించెదరు. సాధించెదరు. విదేశీచదువులులభించును. విదేశీ ప్రయత్నాలు నెరవేరును, ఇంజనీరింగ్ మెడికల్, ఐసెట్, అసెట్, ໖.໑໖, c సెట్, మొదలగు ఎంట్రన్స్ పరీక్షలందు మంచిర్యాంకులు పొందికోరుకున్న కాలేజీలలో సీట్ల పొంద గలరు. క్రీడాకారులకు యోగకాలమే, అనేక విజయాలు, అవార్డులు లభించును. ఈ సం॥రం అన్నిరకముల వ్యాపారులకు యోగకాలమే. ఏ వ్యాపారం చేసినా లాభాలు వచ్చును, హోల్సేల్, రిటైల్, అన్నివిధాలుగా లాభించును. ఆశించిన దానికంటే ఎక్కువ సంపాదించగలరు. నూతన అవకాశములు అధికం
జాయింటు వ్యాపారములు విశేషంగా ఫలించును. ప్రభుత్వప్రవేటు రంగాలలో ఉన్న కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టులు లభించి చక్కని వృద్ధిని పొందగలరు. వ్యవసాయదారులకు అనుకూలమైన సం॥రం రెండు పంటలు విశేషంగా ఫలించును. దిగుబడి బాగా పెరిగి మంచి ఆదాయం పొందుదురు. కౌలుదార్లకు విశేషలాభాలు. గతంలోచేసిన ఋణాల నుండి విముక్తులగుదురు. గృహంలో వివాహాదిశుభకార్థ్యాలు. సంతానసౌఖ్యం, రొయ్యలు, చేపలు, చెరువులు చేయువార్కి ఎక్కువ ఎక్కువ లాభాలు పొందగలరు. ఫౌల్ట్రీఫారం వార్కి అనుకూలమే.

స్త్రీలకు:- స్త్రీలకు ఈసం॥రంమహోన్నతకాలంగా ఉండును. మీమాటకు ఎదురు లేదు. ప్రతిఒక్కరూ మీ మాటకుగౌరవంఇస్తారు. పెద్దగ్రహాలు బలీయంగా ఉండుట వల్ల మీ పేరుతో గృహనిర్మాణాలు విలువైనవస్తువులు సమకూరుట, కుటుంబ సంతో షాలు, సంఘంలో ఉన్నత స్థితి. గతంలో ఎడబాటుగా ఉన్న భార్యాభర్తలు తిరిగి కలుస్తారు. అన్యోన్యతతోస్తుఖంగా జీవిస్తారు. ఉద్యోగం చేయువార్కి పదోన్నతులు లభించును. కోరుకున్న చోటకు బదిలీలు జరుగును. గర్భిణీ స్త్రీలకు పుత్రసంతాన ప్రాప్తి, ఫ్రీడెలివరీ అగును. వివాహంకాని స్త్రీలకు ఈసం॥రం వివాహం జరుగును. మొత్తంమీద ఈ రాశి స్త్రీ, పురుషాదులకు మంచి యోగకాలంగా చెప్పవచ్చును. గత సం||రం కంటే మెరుగ్గా ఉండును. మీ యొక్క సామర్థ్యములు, -తెలివితేటలకు తోడుగా గ్రహబలం తోడగుటచే మీకు ఎదురులేకుండా పోవును.

చేయవలసిన శాంత్తులు:-గ్రహాలుఅనుకూలంగా ఉన్నప్పటికి మధ్యలో మాస వారీగా అవాంతరాల చేత గురువార నియమాలు పాటించాలి. మీపై నరఘోష అధికంగా ఉండుటచే శివాలయదర్శనం, శివాలయంలో రుద్రాభిషేకం, శ్రీశైల క్షేత్ర సందర్శనం మంచిది. నరఘోష, గురుగ్రహ యంత్రాలు ధరించిన మంచిది.

ఏప్రియల్- గ్రహాల అనుకూల సంచారంవల్ల అన్నిరంగాలవార్కి అనుకూలమే. పట్టిందల్లా బంగారమా ? అనునట్లుండును. కుటుంబంలో మీ మాట చెలామణి
అగును. ఆర్ధికలావాదేవీలు సంతృప్తి. యశోభూషణప్రాప్తి, సంతానంద్వారాసౌఖ్యం, సంఘంలో ఉన్నతస్థితి, కుటుంబంలో సఖ్యత, సరైన అవగాహన ఉంటుంది.

మే :-ఈ నెలలో ప్రథమార్ధంబాగుంటుంది. కొన్నిముఖ్యమైన సమస్యలు పరిష్కార మగును. కుటుంబ సభ్యులు, మిత్రుల సహాయసహకారాల వల్ల ముఖ్యసంఘటన నుండిబయటపడుద.రు. ద్వితీయార్ధంలో ఊహించని సంఘటనలు, ఆదాయంనకు మించినఖర్చులు, రోగ్యభంగాలు, కీళత్రవంశంవారితో మాటామాటా పట్టింపులు

జూన్ :- మనస్సు స్థిమితం ఉండదు. ఆరోగ్యంకూడా అంతంతమాత్రమే, శుభకార్య మూలకంగా ధనవ్యయం, ఋణాలుచేయవలసి వచ్చును. ధైర్యంగా ముందుకు వెళ్ళినా లోలోపల భయాందోళనలు హెచ్చును. భయాందోళనలు కలిగించే సంఘటనలు. కుటుంబంలో అశాంతి, సంతానమునకు ఆరోగ్యభంగములు.

జూలై :- గ్రహాలసంచారం ఫర్వాలేదు. అన్నిరంగాలవారికి అన్నివిధాలుగా బాగుం టుంది. ఆరోగ్యం బాగుండి ఆర్ధిక లావాదేవీలు సంతృప్తి. ధైర్యంతో కూడిన పనులు చేసి విజయం సాధిస్తారు. వాహనసౌఖ్యం. బంధుమిత్ర సహాయ సహకారాలు లభించుట. శత్రుజయం, కుటుంబ సౌఖ్యం, స్త్రీలమూలక సహాయం లభించుట.

ఆగష్టు :- చేయువృత్తి వ్యాపారాలందు అనుకూలత, ఆర్ధిక సమస్యల నుండి బయటపడుదురు. నూతన కార్యములకు శ్రీకారం చుట్టెదరు. సంతోషకరవార్తలు వింటారు. ఇతరులుసహాయసహకారాలు అందిస్తారు. కుటుంబ సభ్యులతో సఖ్యత, భార్యాభర్తలు ప్రతీవిషయం చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి. అన్నింటావిజయం.

సెప్టెంబర్ :- ఈనెలలోకూడా అనుకూలగ్రహసంచారంవల్ల ఆనందంగా ఉత్సా హంగా జీవనం గడుచును. ప్రశాంత వాతావరణం ఉంటుంది. దైవదర్శనములు, ఆధ్యాత్మిక విషయాలలో పాల్గొనుట ప్రయాణ సౌఖ్యం, కుటుంబంలో సఖ్యత, నూతన వస్త్ర, వస్తు ప్రాప్తి, “స్త్రీసౌఖ్యం, నూతన పరిచయాలు లాభించును. స్పెక్యులేషన్ కూడా కూడా లాభములు కలుగును. జన్మ కుజుని వల్ల కోపం అధికం.

అక్టోబర్ :-గ్రహాలుఅనుకూలసంచారమున్ననుకొన్నివిషయాలలో ఉద్రేకం, కోపం, ఉండుటచే అనుకోనిదుస్సంఘటనలు జరుగును. మిత్రులసహాయ సహకారాలు లాభించును. ఆర్ధికంగా బాగున్నప్పటికి అనవసర వ్యయం చేయవలసి వచ్చును. స్పెక్యులేషన్లో మిశ్రమ ఫలితాలు కలుగును. జీవనం సాఫీగా ఉంటుంది.

నవంబర్:- అన్నివిధాలుగా, అన్నిరంగాలవార్కి యోగమే. చేయువృత్తివ్యాపారా లందు రాణింపు ఉంటుంది. ఆరోగ్యం బాగుండును. ఆదాయంనకు లోటుండదు. ధైర్యంగా ముందుకు పోగలరు. వాహన సౌఖ్యం, సంతానంతోసఖ్యత, అభివృద్ధి, ప్రయాణములు కలసివచ్చును. వాహనమార్పులు. కీర్తివృద్ధి, యశోభూషణ ప్రాప్తి.

డిశంబర్ :-ఈనెలలో ప్రధమార్ధంలో స్వల్పంగా ఇబ్బందులు. శారీరకగాయాలు, ప్రమాదాలు జాగ్రత్త అవసరం. మాటామాటాపట్టింపులు, స్థానమార్పులు, గృహ మార్పులుతప్పవు. ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు. ద్వితీయార్ధంలో కొంత బాగుం డును. పరిస్థితులు చక్కబడి ఆనందంగాఉంటారు. సంతానం కూడావృద్ది, నూతన పరిచయలాభాలు, స్పెక్యులేషన్ మొదటి నష్టం వచ్చినా చివరకు లాభించును.

జనవరి :- చేయువృత్తి వ్యాపారాలందు రాణింపు, ఆరోగ్యంబాగుండును. ఆర్ధిక లావాదేవీలు అనుకూలత, సరైన సమయానికి ధనం చేతికందును. ప్రతి సమస్యను ధైర్యంగా ఎదుర్కొనివిజయంసాధిస్తారు. దూరప్రయాణాలు నూతనవస్తు, వస్త్రప్రాప్తి, బంధుమిత్రులతో కలసివిందులు, వినోదాలు, స్పెక్యులేషన్లో అనుకూలత, లాభాలు.

ఫిబ్రవరి :-ఈ నెలలో కూడా గ్రహసంచారం అనుకూలంగా ఉండుటచే అన్ని రంగములలో మీదే పై చేయి. గృహములో వివాహాది శుభకార్యములు జరుగును. సంతోషంగా, ఉల్లాసంగా ఉండుట, ఇతరులకు సహాయం అందించుట, దైవ సంబంధ కార్యములలో పాల్గొనుట, సంఘంలో ‘మీ పేరు ప్రఖ్యాతులు పెరుగును.

మార్చి :- చేయు వృత్తివ్యాపారాలందు లాభములు, స్థిరాస్థి వృద్ధి, ధనలాభములు, ఆరోగ్యలాభాలు, కుటుంబసంతోషాలు, సమస్యలు మబ్బు వీడినట్లు విడిపోవును. కార్యానుకూలత, వివాహాదిశుభకార్యాలకు హాజరగుట, శత్రుజయం, స్త్రీ సౌఖ్యం, నూతన పరిచయాలాభములు, స్పెక్యులేషన్ లాభములు కలుగును. సంతానం పరీక్షలు బాగా వ్రాయుదురు. రాజకీయనాయకులను అధికారులను కలుస్తారు.

శ్రీ ప్లవ నామ సంవత్సర రాశి ఫలితాలు 2021