ఉగాది వృశ్చిక రాశి ఫలితాలు – Vruschika Rasi Phalalu 2026-27

ఉగాది వృశ్చిక రాశి ఫలితాలు 2026-27

ఈ పరాభవ నామ సంవత్సరంలో వృశ్చిక రాశి [Sri Parabhava Nama Samvatsara Vruschika Rasi Phalalu 2026-27] వారి యొక్క రాశి ఫలితాలు, ఆదాయ –  వ్యయములు, రాజపూజ్య – అవమానాలు, దోష సమయాలు, అనుకూలించే శుభసమయాలు, స్త్రీలకు ప్రత్యేకించి కలిసివచ్చే అంశాలు, చేసుకోవలసిన శాంతులు, నెలవారీగా ఉండేటువంటి శుభ విశేషాలు సంపూర్ణంగా ఇవ్వబడ్డాయి.

  • ఆదాయం – 11
  • వ్యయం – 5 
  • రాజపూజ్యం – 2
  • అవమానం – 6

ఎవరెవరు వృశ్చిక రాశి లోకి వస్తారు?

సాధారణంగా కింది నక్షత్రాలలో జన్మించిన వారు లేదా, కింది అక్షరాలను వారి పేర్లలో మొదటి అక్షరం గా కలిగిన వారు వృశ్చిక రాశి లోకి వస్తారు.

  • విశాఖ 4వ పాదం(తో)
  • అనురాధ 1,2,3,4 పాదాలు (న, ని,ను, నే)
  • జ్యేష్ట 1,2,3,4 పాదాలు (నో, య, యి, యు)

శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వృశ్చికరాశి ఫలాలు [Vruschika Rasi Phalalu 2026-27] ఈ కింది విధంగా ఉన్నాయి.

శ్రీ పరాభవ నామ సంవత్సరంలో వృశ్చిక రాశి ఫలాలు 2026-27

  • ఈ రాశివారికి గురుడు 2026 జూన్ 1 వరకు అష్టమ స్థానమందు సువర్ణమూర్తి. దీర్ఘాయుర్దాయమును, ధనలాభములను, అత్యంత శుభఫలితములను తదుపరి జూన్ 2 నుండి భాగ్యస్థానమందు రజితమూర్తిగా సౌభాగ్యకరమగు ఫలితములనిచ్చును. రాహ కేతువులు 2026 డిసెంబర్ 5వ తేదీ వరకు చతుర్ధ, దశమ స్థానములందు తామ్రమూర్తులుగా సామాన్యమగు ఫలితములను ఆ తదుపరి డిసెంబర్ 6వ తేదీ నుండి తృతీయ, నవమ స్థానములందు లోహమూర్తులుగానూ అతి సామాన్య ఫలితములను ఇచ్చెదరు.
  • సంవత్సర ప్రారంభంలో గురుని అష్టమస్థానస్థితి ఆరోగ్య విషయమై అనుకూలము కాదు. తల నరములు, మెడ నరములు నొప్పులు, ఉదర సంబంధ అస్థిమితము, ఆర్ధిక విషయాలలో ఆకస్మిక ధనవృద్ధి. వృత్తి, ప్రాపంచిక సౌఖ్యాలను అనుభవిస్తారు. పెద్దలకు ఆయుర్వృద్ధి. ఆపదలు తొలగును. గురుని భాగ్యస్థానమందు ఉచ్ఛస్థితి అన్ని రంగాలలోనూ పురోభివృద్ధిని సూచిస్తుంది.
  • ఉన్నత విద్యలో ఉత్తీర్ణులు అయినవారు చాలా చిన్నవయసులోనే విజయాలను సాధిస్తారు. ఆధ్యాత్మిక పరమైన విద్యలు, సాంస్కృతిక జ్ఞానం, ఉన్నతవిద్యలలో రాణించడం మరియు వారసత్వ విషయాలలో ముందంజ వేయడం వలన ధనవృద్ధి కలుగుతుంది. విదేశాలలో ఉన్నత విద్యలలో రాణించి స్థిరపడే అవకాశాలు ఎక్కువ. డిసెంబర్ నెలలో వక్రగురుని ప్రభావం వలన అభ్యాసం ఆధ్యాత్మిక సాధనలలో అడ్డంకులను అధిగమిస్తారు.
  • పంచమస్థాన శని క్రమశిక్షణ, పట్టుదలతో కార్యసాధకులుగా తీర్చిదిద్దును. సృజనాత్మక ఆలోచనలు, సహనం, పట్టుదల, విజయం. సౌఖ్య సంపన్న జీవనాన్ని పొందుతారు. అదృష్టం, క్రమశిక్షణ కలిగిన సంతానం వలన తల్లిదండ్రులకు సుఖము. విధేయత, పరస్పర అవగాహన, నిబద్ధత కలిగియుంటారు. కుటుంబ బాధ్యతలను స్వీకరిస్తారు. తోబుట్టువులకు స్వస్థత. తల్లి ఆరోగ్యము మెరుగుపడుతుంది. క్రీడలు, విద్య మరియు పరిశోధనలలో రాణిస్తారు. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు కలసిరావు. విద్యార్ధులు ఏకాగ్రతతో అధ్యయనాలలో సంతృప్తికరంగా రాణిస్తారు.
  • ఈ రాశిలోని రైతులకు పంటలు కలసివచ్చును. వ్యవసాయ, అనుబంధ పరిశ్రమల వారికి, యాంత్రిక పరిశ్రమల వారికి ఆదాయ మార్గములు పెరుగును. భూక్రయవిక్రయ మధ్యవర్తులకు, స్థిరాస్థి వ్యాపారులకు రాణింపు. స్వతంత్ర వృత్తులవారికి హోరా గౌరవం పెరుగును. వివాహాది శుభయోగములు, విద్యార్థులకు పురోగతి, వ్యాపారస్థులకు వ్యాపారంలో విజయం. దూరప్రాంతాలలోని అభిమానులను కలుస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్, అధికారుల అండదండలు, సహాయం అందును. కొత్త ఉద్యోగ అవకాశాలు 2026 డిసెంబర్ నుండి సైనిక, రాజకీయ, ఎలక్ట్రికల్ ఇంజనీర్లు, సాంకేతిక రంగాల వారికి ప్రమోషన్లు, దూరప్రాంతాలలో నివాసం. అంటువ్యాధులు, చర్మ సంబంధ సమస్యలు కలుగవచ్చు.
  • వృశ్చికరాశి వారికి అదృష్టసంఖ్య 9.
  • 5, 8 తేదీల సంఖ్యలకు సోమ, గురు, మంగళవారములు కలసిన మరింత ప్రయోజనకరం
Muhurth Fixing | Free Astrology

Astrology Consultation

Price range: ₹1,000.00 through ₹2,500.00

Download Horoscope

Download Horoscope

Price range: ₹500.00 through ₹1,000.00