ఉగాది కన్యా రాశి ఫలితాలు – Kanya Rasi Phalalu 2026-27

ఉగాది కన్యా రాశి ఫలితాలు 2026-27

ఈ పరాభవ నామ సంవత్సరంలో కన్యా రాశి [Sri Parabhava Nama Samvatsara Kanya Rasi Phalalu 2026-27] వారి యొక్క రాశి ఫలితాలు, ఆదాయ –  వ్యయములు, రాజపూజ్య – అవమానాలు, దోష సమయాలు, అనుకూలించే శుభసమయాలు, స్త్రీలకు ప్రత్యేకించి కలిసివచ్చే అంశాలు, చేసుకోవలసిన శాంతులు, నెలవారీగా ఉండేటువంటి శుభ విశేషాలు సంపూర్ణంగా ఇవ్వబడ్డాయి.

  • ఆదాయం – 8
  • వ్యయం – 11
  • రాజపూజ్యం – 3
  • అవమానం – 3

ఎవరెవరు కన్యారాశి లోకి వస్తారు?

సాధారణంగా కింది నక్షత్రాలలో జన్మించిన వారు లేదా, కింది అక్షరాలను వారి పేర్లలో మొదటి అక్షరం గా కలిగిన వారు కన్యారాశి లోకి వస్తారు.

  •  ఉత్తర 2,3, 4 పాదాలు (టొ, ప, పి)
  • హస్త 4 పాదాలు (పు, షం, ణ, ఠ)
  • చిత్త 1,2 పాదాలు (పె, పొ)

శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది కన్యారాశి ఫలాలు [Kanya Rasi Phalalu 2026-27] ఈ కింది విధంగా ఉన్నాయి.

శ్రీ పరాభవ నామ సంవత్సరంలో కన్యా రాశి ఫలాలు 2026-27

  • ఈ రాశివారికి గురుడు 2026 జూన్ 1 వరకు దశమ స్థానమందు తామ్రమూర్తి సామాన్యఫలితములను, తదుపరి జూన్2 నుండి ఏకాదశ స్థానమందు లోహమూర్తిగా ధననాశమును కలుగజేయును.
  • రాహుకేతువులు 2026 డిసెంబర్ 5వ తేదీ వరకు షష్ఠ, ద్వాదశ స్థానములందు రజితమూర్తులుగా సౌభాగ్యకరమగు ఫలితములను, ఆ తదుపరి డిసెంబర్ 6వ తేదీ నుండి పంచమ, ఏకాదశ స్థానములందు రజితమూర్తులుగానూ శుభప్రదమగు ఫలితములను ఇచ్చెదరు.
  • జీవితభాగస్వామి ద్వారా ఆర్థిక లాభాలకు, తల్లి లేదా పెద్ద తోబుట్టువుల నుండి గణనీయమైన లాభాలు, జీవితంలో మెరుగైన ఆనందాన్ని సూచిస్తుంది. సామాజిక సంబంధాలను పెంచుకోవడం, ఉదార దృక్పథం ద్వారా వారి ఆకాంక్షలు నెరవేరును. వ్యక్తిగత ఎదుగుదల, లాభస్థానంలో ఉన్న గురుడు శక్తివంతంగా ప్రయోజనకారిగా రూపుదిద్దుతాడు. ఆర్థిక లాభాలు పొందుతారు.
  • లాభస్థానమందలి గురుని స్థితి సుఖసౌఖ్యాలకు నెలవు అవుతుంది. అధికారవృద్ధి, బాధ్యతాయుతమైన పదవులకు ఎంపిక అవడం, ఇష్టాయిష్టాలను ఎరిగి ప్రవర్తిస్తారు. భద్రత, గుర్తింపు ద్వారా స్నేహితులతో సత్సంబంధాలు, అనుకూల వాతావరణం. పంచమ, షష్ట స్థానాధిపతిగా త్రికోణాధిపత్యకారకమై శుభఫలితాన్ని ఇస్తాడు. శారీరక దారుఢ్యం ఇస్తాడు. సంతానంతో, సోదరులతో అభిప్రాయ భేదాలు. వైవాహిక జీవితంలో సమస్యలు ఉంటాయి.
  • శని సంచారకాలం వైవాహిక సంబంధాలు, భాగస్వామ్యం, వృత్తి జీవితంలో స్థిరత్వాన్ని తెస్తుంది. వ్యక్తిగత జీవితంలో సంబంధాలకు కట్టుబడి ఉంటారు. జీవిత భాగస్వామితో కలసి వివాదాలు లేని మానవసేవ చేస్తారు. భాగస్వామ్య వ్యాపారాలకు మంచి కాలం. విద్యార్థులకు ఉన్నత విద్యలు కలసి వస్తాయి. ఊబకాయం, మోకాళ్ళు, జనన అవయవాలకు సంబంధించి ఆరోగ్య సమస్యలుంటాయి. జీవనంలో పరిణితి చెందడానికి, క్రమశిక్షణతో మరియు బాధ్యతాయుతంగా మంచి వ్యక్తిత్వంతో బలంగా ఉంటారు. కొత్త ఇల్లు లేదా వాహనాన్ని కొనుగోలు చేస్తారు. నిబద్ధత, క్రమశిక్షణ మరియు సహనాన్ని అవలంభించడం ద్వారా జీవితంలో విజయం సాధించగలుగుతారు.
  • రైస్ మిల్లులు, ధాన్యం ఆధారిత వ్యాపారాలు, స్థిరాస్థి వ్యాపారం మరియు గృహ నిర్మాణాలు చేయువారికి ఆదాయాలు వస్తాయి. ఉత్పత్తుల రంగం, ఇసుక, ఖనిజ రవాణాలు చేయువారికి సౌఖ్యంగా ఉంటుంది. వడ్డీవ్యాపారం, షేర్లలో పెట్టుబడులు చేయువారికి సామాన్య వృద్ధి ఉంటుంది. రాహుకేతువుల సంచారం ఈ రాశివారికి అనుకూలం. శత్రుక్షయం మిత్రలాభం అవుతుంది. గత సంవత్సరంలో వృత్తి వ్యాపారాలలో సవాళ్లను అధిగమించి పురోగమిస్తారు. వృత్తి వ్యాపారాలలో అనుకూలత. ఆశించిన ధనలాభాన్ని పొందుతారు.
  • కన్యారాశి వారికి అదృష్ట సంఖ్య 5. ఆది, బుధ, శుక్ర, శనివారాలతో కలసివస్తే మరిన్ని మెరుగైన ఫలితాలుంటాయి.
Muhurth Fixing | Free Astrology

Astrology Consultation

Price range: ₹1,000.00 through ₹2,500.00

Download Horoscope

Download Horoscope

Price range: ₹500.00 through ₹1,000.00