ఉగాది కన్యా రాశి ఫలితాలు – Kanya Rasi Phalalu 2024-25

Loading

ఉగాది కన్యా రాశి ఫలితాలు - Kanya Rasi Phalalu 2024-25

Poojalu. com శ్రేయోభిలాషులకు శుభాభినందనలు. ఇకపై గ్రూప్ ల ద్వారా కాకుండా నేరుగా నిత్య పంచాంగం, పూజా విధానాలు, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మిక సమాచారాలను పొందడానికి ఇప్పుడే మా WhatsApp Channel ను అనుసరించండి.

ఉగాది కన్యా రాశి ఫలితాలు 2024-2025

ఈ క్రోధి నామ సంవత్సరంలో కన్యా రాశి [Sri Krodhi Nama Samvatsara Kanya Rasi Phalalu 2024-25] వారి యొక్క రాశి ఫలితాలు, ఆదాయ –  వ్యయములు, రాజపూజ్య – అవమానాలు, దోష సమయాలు, అనుకూలించే శుభసమయాలు, స్త్రీలకు ప్రత్యేకించి కలిసివచ్చే అంశాలు, చేసుకోవలసిన శాంతులు, నెలవారీగా ఉండేటువంటి శుభ విశేషాలు సంపూర్ణంగా ఇవ్వబడ్డాయి.

  • ఆదాయం – 05, వ్యయం – 05
  • రాజపూజ్యం – 05, అవమానం – 02

ఎవరెవరు కన్యారాశి లోకి వస్తారు?

సాధారణంగా కింది నక్షత్రాలలో జన్మించిన వారు లేదా, కింది అక్షరాలను వారి పేర్లలో మొదటి అక్షరం గా కలిగిన వారు కన్యారాశి లోకి వస్తారు.

  •  ఉత్తర 2,3, 4 పాదాలు (టొ, ప, పి)
  • హస్త 4 పాదాలు (పు, షం, ణ, ఠ)
  • చిత్త 1,2 పాదాలు (పె, పొ)

శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది కన్యారాశి ఫలాలు [Kanya Rasi Phalalu 2024-25] ఈ కింది విధంగా ఉన్నాయి.

కన్యా రాశి ఫలాలు 2024-25

ఈ రాశి వారికి ఈ సంవత్సరములోగ్రహముల దోషకాలములు

  • రవి : 14-4-2024 నుండి 14-5-2024 వరకు అష్టమం.17-8-2024 నుండి 17-10-2024 వరకు ద్వాదశం, జన్మం. 16-12-2024 నుండి 14-1-2025 వరకు అర్ధాష్టమం.
  • కుజుడు : 2-6-2024 నుండి 12-7-2024 వరకు అష్టమం.
  • గురుడు: ఈ సం॥రం శుభుడే.
  • శని : ఈ సం॥రం శుభుడే
  • రాహు, కేతువులు: ఈ సం||రం సప్తమం, జన్మం.

ఈ రాశి వారలకు గురుడు భాగ్యమందు సంచారం, శని ఆరింట బలీయుడు, ఈ సం||రం స్త్రీ పురుషాదులకు మిశ్రమ ఫలితాలుగా ఉండును. మీలో ఎన్నో రకముల సామర్థ్యములున్నా ముందుకు వెళ్ళ లేకుండుట జరుగును. అకారణంగా మాటలుపడుట, రావలసిన బాకీలురాకుండుట, ఆదాయమునకు అంతరాయము. లోలోపల అధైర్యం ఏర్పడును. రక్తబంధు వర్గంలో కలతలు. అశాంతి, మనస్సుకు హెచ్చరికలు లేకుండుట, మందత్వము, గుప్తశత్రుభాధలు, స్వంత పనుల కంటే పై వారి పనులలో శ్రద్ధ, లేనిపోని అనుమానములకు మనస్సులోనగుట, మీ సొమ్ముతిని ఉపకారం పొందినవారే శత్రువులుగా అగుదురు. ఆడవారి ప్రేరేపణచే జరుగు పనులలో ఆందోళనహెచ్చును. ధనవ్యయం మీద కొట్టివేయును. పుణ్యక్షేత్ర సంచారం. గృహమార్పులు, ప్రయాణాలలో ఒత్తిడి. ఔషధ సేవలు చేయుట, చోర భయం, సాంఘికంగా అపనిందలు, గౌరవాదులలో మార్పులు, ఏదోరూపముగా ధనముచేతికి అందుచూ అనేకరకములుగా సొమ్ముహారతి కర్పూరంవలె హరిం చును. శారీరకమానసికబాధలుతప్పవు. ఆందోళనహెచ్చును. వ్యసనములుద్వారా ధనవ్యయం. వృధాగా కాలక్షేపం చేయుట, శని బలీయంగా ఉండుటచే కొన్ని విషయాలలో ధైర్యంగా ముందుకు పోగలరు. మీ ధైర్యసాహసాలే మిమ్మల్ని సమస్యలనుండిరక్షించును. భార్యాభర్తల మధ్య ఒక్కోసారి మాటామాటా పట్టింపులు, ఈ సం||రం ఉద్యోగులకు మిశ్రమ ఫలితాలుంటాయి. కొన్ని డిపార్టుమెంటుల వార్కి బాగుండును. కొన్ని డిపార్టుమెంట్లు వార్కి అనుకూలత ఉండదు. కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వములందున్న వారీ సాఫీగా జీవనం సాగిపోవును. అధికారుల మన్ననలు పొందినా ప్రమోషన్రావు. వచ్చినట్టేవచ్చిచేజారిపోవును. నిరుద్యోగు లకు ఏదో ఒక ఉద్యోగం లభించును. కాని అంతబాగుండదు. ప్రవేటు సెక్టారులో పనిచేయువార్కి యజమానుల గుర్తింపులభించదు. మరొక కంపెనీలకు మారు దురు. మీ శ్రమకు తగిన ఫలితం లభించదు. నిరుత్సాహంగా జీవితం ఉండును.

రాజకీయ నాయకులకు శని బలం వలన రాణింపు ఉంటుంది. అవసరానికి అనుగుణంగా సమయానుకూలంగా వ్యవహించుట వలన ప్రజలలో గుర్తింపు ఉంటుంది. ప్రజానుకూల కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. పార్టీ పరంగా మంచి గుర్తింపు ఉంటుంది. పార్టీలోఏదో ఒక పదవి తప్పకలభించును. కానీ ఎన్నికల లందు పోటీచేసినవిజయం లభించదు. అధికంగా ధనము ఖర్చు అగును. నష్టము.

ఈ సం॥రం కళాకారులకు గురు బలం కారణంగా రాణింపు ఉంటుంది. టిని సినిమా, నాటకరంగాలలో ఉన్న గాయనీ, గాయకులు, దర్శకులు, నటీనటు లకు, ఇతర సాంకేతిక నిపుణులకు విజయాలు స్వల్పం, నిరుత్సాహం, నూతన అవకాశాలు అంతంత మాత్రమే. ఆర్థికంగా ఇబ్బందులు, అవార్డులు పొందలేరు.

ఈ సం||రం వ్యాపారస్తులకు బాగానే ఉంటుంది. ఆశించినంతమేరలాభాలు పొందలేరు, ఇస్తుము, ఇటుక, సిమ్మెంటు, కంకర వ్యాపారస్థులకు అనుకూలత, సరుకులు నిల్వచేయువారలకు నష్టాలు, కిరాణా వ్యాపారస్థులకు ఫర్వాలేదనిపిం చును. ఫైనాన్సు రంగంలో ఉన్న వార్కి నష్టాలు. కాంట్రాక్టుదారులకు, రియల్ఎస్టేట్ చేయువారికి కొంతమేరఅనుకూలించును. “వెండి,బంగారంవ్యాపారస్తులకు నష్టాలు,
ఈ సం||రం విద్యార్థులకు గురుబలం కారణంగా చదువుపై శ్రద్ధ ఉంటుంది. స్నేహితులతో కాలక్షేపం చేయదురు. జ్ఞాపకశక్తి పెరుగును. పరీక్షలందు విజయం ఇంజనీరింగ్, మెడిసిన్, లాసెట్, ఇ. సెట్, ఆసెట్, బి.ఇడి, పాలిటెక్నిక్ మొదలగు ఎంట్రన్స్ పరీక్ష వ్రాయువారికి మంచిర్యాంకులువచ్చినా కోరుకున్న చోట్ల సీట్లును పొందలేరు. క్రీడాకారులకు కొంత ఫర్వాలేదు. కొన్ని విజయాలు లభించును.
ఈ సం||రం వ్యవసాయదారులకు మొదటి పంట కంటే రెండవ పంటఫలిం చును. ఆదాయ, వ్యయములు సమానంగా ఉండును. ఋణాలు చేయక తప్పదు. కౌలుదార్లుకు ఆర్థికంగా ఇబ్బందులు. జీవనం ప్రశ్నార్ధకంగా మారును. రొయ్యలు, చేపల చెరువుల వార్కి కొంతమేర ఫర్వాలేదు. కోళ్ళఫారం వార్కి బాగుంటుంది.

స్త్రీలకు:- ఈ సం||రం గురుడు 9వ ఇంటసంచారం, రాహువువల్ల కుటుంబంలో శ్రీశాంతి, భార్యాభర్తల మధ్య గొడవలు, విలువైన వస్తువులు పోగొట్టుకుంటారు. ఉద్యోగాలు చేయువార్కి కుటుంబమునకు దూరంగా ఉండవలసినపరిస్థితి, అధికారులువల్లఇబ్బందులు, సుదూరప్రాంతాలకు బదిలీలు, ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే. గర్భసంబంధ వ్యాధులు లవచ్చును. గర్భిణీ స్త్రీలకు ఆపరేషన్ ద్వారా డెలివరి ప్రథమార్ధంలో అయితే పుత్ర సంతాన ప్రాప్తి, ద్వితీయార్ధంలో స్త్రీ సంతానప్రాప్తి, వివాహం కాని స్త్రీ లకు ద్వితీయార్ధంలో వివాహం జరుగును. మొత్తం మీద ఈ సం॥రం స్త్రీ పురుషాదులకు మిశ్రమ ఫలితాలుండును. కొందరికియోగం, మరికొందరిఅవయోగం. శని బలంగాఉన్ననూ రాహువు, కేతువులు బలం లేని కారణంగా జీవితం అస్తవ్యస్తంగా ఉంటుంది. ఆందోళనలు.

చేయవలసిన శాంతులు:– మంగళ వార నియమాలు పాటించాలి. మీ గ్రామంలో ఉన్న శివాలయంలో ప్రదక్షిణలు లేదా రుద్రాభిషేకం, శ్రీశైలక్షేత్రం సందర్శన చేయాలి. రాహువు, కేతువు జపాలు, హోమం, దానంచెయ్యాలి. రాహువు, కేతువుల గ్రహయంత్రాలు ధరించిన మంచిది.

ఏప్రియల్- చేయువృత్తివ్యాపారాలు అంతఅనుకూలంగా ఉండవు. అన్నిరంగాల వార్కిఇబ్బందులుతప్పవు. ఆరోగ్య భంగాలు, ఆర్థికంగానష్టాలు, శారీరక శ్రమ, -అకాల భోజనాలు, వ్యవహార భంగాలు, కుటుంబ వ్యక్తులతో విరోధాలు, సంతానం ద్వారా కూడా సమస్యలు, స్త్రీ సౌఖ్యం తక్కువ. స్పెక్యులేషన్లో నష్టములు వచ్చును.

మే:- ఈ నెలయందు ప్రధమార్ధంలో బాగుండును. అన్నిరకములుగా నష్టములే. ద్వితీయార్థంలో చేయు వృత్తివ్యాపారాలు రాణించును. ఆదాయం బాగుండును. గతంలో ఉన్న సమస్యల నుండి బయటపడుదురు. మిత్రుల సహాయ సహకారములు లాభించును. నూతన పనులు ప్రారంభిస్తారు. స్పెక్యులేషన్లో లాభములు వచ్చును.

జూన్ :- గ్రహాలు అనుకూలసంచారంవల్ల అన్నిరంగాలవార్కి లాభమే. చేయు వృత్తివ్యాపారాలందురాణింపు. ఆరోగ్యంబాగుండును. ఆర్ధికలావా దేవీలు సంతృప్తి, కుటుంబంలో సంతోషాలు, సంతానం రీత్యా లాభములు, వాహనసౌఖ్యం, బంధు మిత్రులసహాయం, గౌరవలాభం, స్పెక్యులేషన్అనుకూలం. నూతన పరిచయలాభం.
:-
జూలై తలపెట్టిన కార్యాల విజయం, ధనలాభాలు, నూతన వ్యవహారములు కలసివచ్చును. మీ మాటకు విలువ పెరుగును. ఇతరులకు మాట సహాయం చేస్తారు. వాహన మార్పులు, ఉద్యోగులకు ఆనందమైన జీవనం. మంచి గుర్తింపు లభించును. స్త్రీమూలక లాభాలు, తీర్ధయాత్ర ఫలప్రాప్తియు. శత్రువులపై ఆధిక్యత.

ఆగష్టు:- ఈ నెలలో 12 ఇంట గ్రహసంచారం వలన అనుకూలంగా ఉండదు. ఆదాయంనకు మించిన ఖర్చులు, పసులు కలసిరాక ఇబ్బందులు. కుటుంబ సమస్యలు, సూతకాలు, ఇతరులను పరామర్శచేయుట, బంధుమిత్రులతో విరోధ ములు, అపనిందలు, అవమానములు, ఉద్యోగులకు బదిలీలు, స్థాన మార్పులు, గృహమార్పులు తప్పవు. నమ్మినవారి వలన మోసపోవుట, అశాంతిగా ఉంటుంది.

సెప్టెంబర్:- ఈనెలలోకూడా అనుకూలంగా ఉండదు. పనులందు ఆటంకాలు, మనస్సుప్రశాంతంగా ఉండదు. ప్రతినిమిషంలో ఏదోఒకసమస్యతోబాధపడుదురు. అనేకదుస్సంఘటనలు జరుగును. ఇతరుల సమస్యలువల్ల మీరు ఇబ్బందులకు గురిఅగుదురు. ప్రతీవిషయంలోనూ జాగ్రత్త అవసరం. స్పెక్యులేషన్లో నష్టములు.

అక్టోబర్:- ఈనెలలోకూడా ప్రథమార్ధంలో బాగుండదు. 15 తేదీతర్వాత పరిస్థి తులు కొంతమేర అనుకూలించును. ముఖ్యసమస్యల నుండి బయటపడుదురు. సంతానం ద్వారా ఉన్న ఇబ్బందులు పరిష్కారమగును. ఆరోగ్యం బాగుండును. ఆర్దికంగా నిలద్రొక్కుకుంటారు. కుటుంబసౌఖ్యం, స్పెక్యులేషన్లోమిశ్రమఫలితాలు.

నవంబర్:- గత మూడు నెలలుగా పడుచున్న బాధలు తొలగును. చేయువృత్తి వ్యాపారములందు రాణింపు ఆర్థికంగా బాగుండును. గతంలో ఉన్న సమస్యలు పరిష్కారమగును. వ్యవహారజయం, మిత్ర సహాయం లభించును. కుటుంబ సంతోషములు గృహ నిర్మాణాధిపనులు కలసివచ్చును. స్పెక్యులేషన్ లాభములు.

డిశంబర్:- ఈనెలలో అన్నిరంగాలవార్కి యోగమే. చేయువృత్తి వ్యాపారాలు లాభించును. ఆరోగ్యంబాగుంటుంది. ఆదాయంనకులోటుండదు. ప్రతీ విషయంలో ధైర్యంగా ముందుకుపోగలరు. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. నూతనకార్యాలకు శ్రీకారం చుట్టెదరు. శత్రువులపై ఆధిక్యత. స్త్రీ సౌఖ్యం, సంతాన సౌఖ్యం. నూతన పరిచయ లాభములు, స్పెక్యులేషన్లో లాభములు. నూతన పరిచయలాభములు.

జనవరి :- గ్రహముల అనుకూల సంచారం వల్ల కార్యాలందు జయం. నూతన వస్త్ర,వస్తుప్రాప్తి, బంధుమిత్రులతో విందులు, వినోదాలు, దూరప్రయాణాలు, పాత మిత్రులనుకలుసుకొంటారు. కుటుంబసంతోషాలు, ఆనందంగా ఉండుట, సమస్యల నుండి బయటపడుట, కీర్తిలాభములు, స్పెక్యులేషన్లో లాభములు కలుగును.

ఫిబ్రవరి :- ఈ నెలలో శుభా శుభ మిశ్రమంగా ఉండును. కొందరికి యోగం, మరికొందరికి అవయోగం చేయును. వృత్తి వ్యాపారములందు రాణింపు. ఉన్ననూ ధనమునకు ఇబ్బందులు తప్పవు. కోపం హెచ్చుగా ఉండుటవల్ల సమస్యలు కొని తెచ్చుకొంటారు. బంధుమిత్రులతో విరోధములు, చికాకు కల్గించు సంఘటనలు.

మార్చి:-ఈనెలలో చేయువృత్తివ్యాపారాలుబాగుండును, మనఃశ్శాంతి ఉంటుంది. ఆరోగ్యలాభం. శారీరకశ్రమ. అకాలభోజనాలు, ఉద్యోగులకుబదిలీలు, అపవాదులు, వాహనసౌఖ్యం. సోదరవర్గంవారితోసఖ్యత, భూసంబంధవ్యవహారాలులాభించును. సంతానం పరీక్షలు బాగా వ్రాయుదురు. గృహంలో శుభకార్యాలు జరుగును.

Muhurth Fixing | Free Astrology

Astrology Consultation

1,050.002,625.00

Download Horoscope

Download Horoscope

525.001,050.00

Kanya Rasi Phalalu, Kanya Rasi Ugadi Rasi Phalalu, Ugadi Rasi Phalalu, Ugadi Rasi Phalalu 2024-25, Ugadi Rasiphalalu, Virgo Rashiphal, What is the future of Kanya Rasi, Yearly Prediction for Virgo
ఉగాది తులా రాశి ఫలితాలు – Tula Rasi Phalalu 2024-25
ఉగాది సింహ రాశి ఫలితాలు – Simha Rasi Phalalu 2024-25

Related Posts

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.