ఉగాది తులా రాశి ఫలితాలు – Tula Rasi Phalalu 2024-25

Loading

ఉగాది తులా రాశి ఫలితాలు - Tula Rasi Phalalu 2024-25

Poojalu. com శ్రేయోభిలాషులకు శుభాభినందనలు. ఇకపై గ్రూప్ ల ద్వారా కాకుండా నేరుగా నిత్య పంచాంగం, పూజా విధానాలు, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మిక సమాచారాలను పొందడానికి ఇప్పుడే మా WhatsApp Channel ను అనుసరించండి.

ఉగాది తులా రాశి ఫలితాలు 2024-2025

ఈ క్రోధి నామ సంవత్సరంలో తులా రాశి [Sri Krodhi Nama Samvatsara Tula Rasi Phalalu 2024-25] వారి యొక్క రాశి ఫలితాలు, ఆదాయ –  వ్యయములు, రాజపూజ్య – అవమానాలు, దోష సమయాలు, అనుకూలించే శుభసమయాలు, స్త్రీలకు ప్రత్యేకించి కలిసివచ్చే అంశాలు, చేసుకోవలసిన శాంతులు, నెలవారీగా ఉండేటువంటి శుభ విశేషాలు సంపూర్ణంగా ఇవ్వబడ్డాయి.

  • ఆదాయం – 02, వ్యయం – 08
  • రాజపూజ్యం – 01, అవమానం – 05

ఎవరెవరు తులా రాశి లోకి వస్తారు?

సాధారణంగా కింది నక్షత్రాలలో జన్మించిన వారు లేదా, కింది అక్షరాలను వారి పేర్లలో మొదటి అక్షరం గా కలిగిన వారు తులారాశి లోకి వస్తారు.

  • చిత్త 3, 4 పాదాలు (ర,రి)
  • స్వాతి 1, 2, 3, 4 పాదాలు (రు, రె, రో,త)
  • విశాఖ 1, 2, 3 పాదాలు (తి, తు, తే)

శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది తులారాశి ఫలాలు [Tula Rasi Phalalu 2024-25] ఈ కింది విధంగా ఉన్నాయి.

తులా రాశి ఫలాలు 2024-25

ఈ రాశి వారికి ఈ సంవత్సరములోగ్రహముల దోషకాలములు

  • రవి: 15-5-2024 నుండి 14-6-2024 వరకు అష్టమం. 17-9-2024 నుండి 16-11-2024 వరకు ద్వాదశం, జన్మం, 14-1-2025 నుండి 12-2-2025 వరకు అర్ధాష్టమం
  • కుజుడు : 12-7-2024 నుండి 26-8-2024 నుండి అష్టమం.
  • గురుడు : ఈ సం॥రం అష్టమం.
  • శని : ఈ సం||రం శుభుడే
  • రాహువు: ఈ సం||రం శుభుడే.
  • కేతువు : ఈ సం॥రం ద్వాదశం.ఈరాశి స్త్రీపురుషాదులకు దైవికబలం హెచ్చుగానుండును. ధనం, కుటుంబం, సంపత్తు, పుత్రులకు కారకుడైన గురుడు 8వ ఇంట సంచారం. ఏపనిలోనైనా ఆత్మవిశ్వాసముతో ముందుకు పోగలుగుట, రాహువు, కేతువులు బలము వలన శని 5వ స్థానంలో ఉండుట విశేషించి యోగమును అనుభవిస్తారు. శత్రువులు అంతరించుట వ్యవహారాదులలో జయము. గతంలో సాధించలేని పనులు ఈ సమయంలో బాగుగాఫలించును. ఏవృత్తివ్యాపారాదులలోఉన్నవారికైనా బాగుం డును. ఒడిదుడుకుల నుండి బయటపడుదురు. రావలసిన సొమ్ములు వచ్చును. గృహసబంధరీత్యాలాభములు, నూతనగృహాలు నిర్మించుట కనీసం ఇండ్ల స్థలమైన కొంటారు. అపనిందలువంటివి కలిగినా అట్టివి అంతరించి ఉభయక్షేమం కలు గును. సాంఘికాభివృద్ధి, మనోవాంఛలు నెరవేరి, స్వశక్తి సామర్థ్యముచే పైకిరా గలరు. ఒక్కో సమయాన ఆదాయమునకు మించిన ఖర్చులుచేయుదురు. శత్రుత్వ ములు వచ్చినా అణచివేస్తారు. నూతన ప్లానులు పోకడలచే సంఘంలో గౌరవా దులు సిద్ధించును. పుణ్యక్షేత్ర సందర్శనం, గృహములో వివాహాది శుభకార్యములు. కలసి వచ్చుట, దాంపత్యానుకూలత, గృహ జీవితానందం కలుగును. ప్రతీ చిన్న విషయమునుమీకు అనుకూలంగా మలచుకొందురు. 8వ ఇంట గురువు వలన గృహసంబంధమైన ఒత్తిడి, ఒడిదుడుకులు. మీలోగలనిజాయితీ, ప్రవర్తన కొంతమేర కష్టములనుండి కాపాడును. పనివారలు వలనదొంగలు వలన మోసపోవుదురు.

ఈ సం॥రం ఉద్యోగులకు అన్నివిధాలుగాయోగమే. గ్రహసంచారం బాగుండు టచే ప్రమోషన్తో కూడిన బదిలీలు. కోర్టు కేసులున్న వార్కి కూడా అనుకూలంగా తీర్పులు వచ్చుట, గృహ నిర్మాణాది కార్యాలుచేస్తారు. వాహన మార్పులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉదోగ్యులకు అనుకూలత, మీశక్తి సామర్ధ్యాలను అధికారులు గుర్తించె దరు. నిరుద్యోగులకు ఈసం॥రం తప్పకఉద్యోగాలు పొందగలరు. జీవన స్థిరత్వం ఏర్పడును. పర్మినెంటుకానివార్కిపర్మినెంటు అగును. విదేశప్రయాణాలు ఫలించును. రాజకీయ నాయకులకు మహోన్నత కాలంగా ఉంటుంది. ప్రజలలో మంచి ఆదరణ, పేరుప్రఖ్యాతులుపొందగల దగలరు. అనేకసహాయాలుచేయుదురు. పార్టీలోనూ, హైకమాండ్లోనూ మీకుమంచిపేరు. పార్టీలోగాని ప్రభుత్వంలోగాని వీదో ఒక నామినేటెడ్ పదవి లభించుదనుటలో సందేహమే లేదు. ఎన్నికలలో పోటీ చేసిన మీదే విజయం. శత్రువులను మీ తెలివితేటలతో మీ ఎత్తులతో అణచివేయగలరు.

ఈ సం||రం గురుబలం లేనందున కొన్ని మిశ్రమఫలితాలు, టి.వి సినిమా రంగంలో ఉన్న గాయనీ, గాయకులు, నటీనటవర్గం, సాంకేతిక నిపుణులకు విజ యాలు లభించి నూతన అవకాశములు మెరుగుపడును. స్థిరాస్థివృద్ది, మీరు పనిచేసినవి ప్రజాదరణ పొందగలవు. ప్రభుత్వం, ప్రైవేటు సంస్థల అవార్డులు.

అన్ని రకముల వ్యాపారస్థులకు లాభదాయకముగా ఉండును. ఆశించినమేర లాభములు. నూతన వ్యాపార ప్రారంభాలుచేస్తారు. హోల్సేల్ మరియు రిటైల్ వ్యాపారులకు అనుకూలమే. జాయింటు వ్యాపారస్థులకు భాగస్వామితో సఖ్యత, మంచిలాభాలు, రియల్ ఎస్టేటు వ్యాపారులకు అనుకూలమే. కాంట్రాక్టు పనులు చేయువారికి లాభమే. నూతన కాంట్రాక్టులు లభించి బిల్లులు సకాలంలో వచ్చును.

విద్యార్థులకు జ్ఞాపకశక్తి తగ్గును. చదువులపై కాకుండా ఇతర వ్యాపకములు వల్ల బొటాబొటిమార్కులతో ఉత్తీర్ణులగుదురు. విదేశీచదువులగురించి ప్రయత్నాలు ఫలించును. ఇంజనీరింగ్, మెడిసిన్, లాసెట్, ఐసెట్, ఆసెట్, బి.ఇడి, పాలిటెక్నీక్ మొదలగు ఎంట్రన్సు పరీక్ష వ్రాయువారు కోరుకున్న కాలేజీలలో సీట్లను మంచి ర్యాంకులుపొందలేరు. క్రీడాకారులకు అనుకూలమే. అనేకవిజయాలు లభించును.

వ్యవసాయదారులకు రెండు పంటలు ఫలించును. పంట దిగుబడి బాగుండు టచే ఆదాయము బాగుండును. గృహనిర్మాణాలు, గృహంలో శుభకార్యములు జరుగును. కౌలు రైతులు ఋణములు తీర్చివేయుదురు. రొయ్యలు, చేపలు,
చెరువుల వార్కి విశేషలాభములు, కోళ్ళఫారం వార్కి విశేషంగా లాభించును.

స్త్రీలకు :- ఈ సం||రం గ్రహాల బలం బాగుండుట బాగుండుటచే శని, రాహువుల బలముచే మీమాటకుఎదురుండదు. ఎంతటివారైనా మీమాటకుఎదురుచెప్పరు. కుటుంబంలో మీ విలువ పెరుగును. విలువైన ఆభరణములులభించును. మీ పేరులో పేరులో స్థిరాస్తులు ఏర్పడును. గృహంలోసంతోషాలు, సంతానం వల్ల ఆనందం, భార్యాభర్తల మధ్య సరైన అవగాహనుంటుంది. ఉద్యోగముచేయువార్కి కోరుకున్న చోట్లకు బదిలీలు. గర్భిణీ స్త్రీలకు ఫ్రీడెలివరీ పుత్ర సంతానం ప్రాప్తి. వివాహం కాని స్త్రీలకు ఈ సం॥రం తప్పక వివాహం జరుగును. గతంలో విడిపోయిన వారు కలుస్తారు. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషులకు యోగదాయకంగా ఉంటుంది. మీ తెలివితేటలు, శక్తిసామర్ధ్యాలు, మిమ్మల్ని రక్షించును. మీ ముఖ వర్చస్సు చూడగానే ఇతరులకు గౌరవం.మంచి అభిప్రాయం కలుగును. అన్ని విధాలుగా బాగుండును.

చేయవలసిన శాంతులు:-మీపై ఈర్ష్య, అసూయ, ద్వేషం, నరఘోషఅధికం,గాన మంగళ, గురువారనియమాలు పాటించాలి. శివాలయంలోరుద్రాభిషేకం చేయించుకోవాలి. మాసశివరాత్రివ్రతం, శ్రీశైలక్షేత్ర సందర్శన చేయాలి. నరఘోష, గురు గ్రహయంత్రాలు ధరించిన మంచిది.

ఏప్రియల్:- అన్నిరంగాలందు అందరికీ యోగమే. చేయు వృత్తివ్యాపారాలందు రాణింపు, ఆరోగ్యంబాగుండును. ఆర్ధికలావాదేవీలు సంతృప్తి, ధైర్యంగా ముందుకు పోగలరు. వాహన సౌఖ్యం, గృహంలో శుభకార్యాలు, విందులు, వినోదములు, సంతానసౌఖ్యం, శత్రువుల పైజయం కాని భార్యాభర్తల మధ్య చిన్నచిన్న తగాదాలు.

మే :- గ్రహసంచారాలు అనుకూలంగా ఉన్నందున అన్నిరంగాలవార్కి బాగుం టుంది. మీకార్యాలుసకాలంలో పూర్తిచేయగలరు. సంతానసౌఖ్యం, కుటుంబ సౌఖ్యం. వాహనలాభాలు, వివాహాది శుభకార్యాలకుహాజరగుట, పెద్దవార్ని కలుసుకొనుట, అన్నింటాముందంజలో ఉంటారు. సంతానం వల్ల ఆనందం, స్పెక్యులేషన్ లాభం.

జూన్ :- ఈ నెలలో ప్రథమార్ధంలో స్వల్పంగా ఇబ్బందులు కలిగిననూ ద్వితీయా ‘ర్గంలోచాలాబాగుంటుంది. అన్నివిధాలా అందరికీయోగమే. మీమాటకు ఎదురుం Žదు. మీ సలహాలు ఇతరులు విని లబ్దిని పొందుట, కుటుంబ సౌఖ్యం, నూతన వస్తు, వస్త్ర ప్రాప్తి, విలువైన వస్తువులు లాభించును. స్పెక్యులేషన్లోలాభించును.

జూలై :-ఈ నెలంతా మీదే పైచేయిగా ఉండును. పట్టిందల్లాబంగారమా? అనున ట్లుండును. ఆదాయం బాగుండి ఆరోగ్యలాభం, సమస్యలు పరిష్కారం. కోర్టు వ్యవహారాలందు జయం, ఉద్యోగులకు ప్రమోషన్లు భార్యాభర్తల మధ్య మంచి అవగాహన. వాహన సౌఖ్యం, శత్రుజయం, నూతన పరిచయాలు లాభించును.

ఆగష్టు :-ఈనెలలో కూడా మీ మాటకుఎదురుండదు. అన్నిరంగాలు వార్కి చేయు వృత్తి వ్యాపారాలందు రాణింపు ఉంటుంది. ఆరోగ్య లాభములు, రావలసిన బాకీలు వసూలగుట, నూతనకార్యాలకు శ్రీకారంచుట్టెదరు. భూసంబంధ లావా దేవీలు అనుకూలత. ఇతరుల విషయంలో జోక్యం చేసుకుంటారు. రాజకీయ నాయకులను, గురువులను కలుసుకొంటారు. స్పెక్యులేషన్ అనుకూలం కాదు.

సెప్టెంబర్:- ఈ నెలలో అంతగా అనుకూలంగా ఉండదు. వ్యాపారములందు స్వల్పంగానష్టాలు, పనులందు ఆటంకాలు, ఆరోగ్యభంగాలు, ఊహించని ఖర్చులు, సమస్యలువల్లబాధలు, ఆరోగ్యం కూడా బాగుండదు. కుటుంబంలో అందరితోనూ మాటామాటాపట్టింపులు. శారీరక శ్రమఅధికం. స్పెక్యులేషన్లో అధికనష్టములు.

అక్టోబర్ :-ఈనెలలో శుక్రబలం వలన మీమాటకు విలువ పెరుగును. పట్టుదల, ఉత్సాహం, కార్యదీక్షత పెరుగును. శ్రమకు తగ్గ ఫలితం లభించును. కుటుంబంలో సఖ్యత, స్త్రీ సౌఖ్యం, భార్యాభర్తల మధ్య సరైన అవగాహన బాగుండును. నూతన పరిచయాలు లాభించును. ప్రయాణ సౌఖ్యం. దైవ సంబంధ కార్యములు చేస్తారు.

నవంబర్:- ఈ నెలయందు గ్రహ సంచారము అనుకూలంగా ఉన్నందున చేయు వృత్తివ్యాపారములు బాగుండును. ఆదాయ వృద్ధి, ఆరోగ్య లాభములు, వ్యవహారజయం, సమస్యలు పరిష్కారమగును, ఉద్యోగులకు ప్రమోషన్స్, స్త్రీలకు ఆభరణప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, భూసంబంధ వ్యవహార లాభములు అనుకూలత.

డిశంబర్:- మీ శక్తి సామర్థ్యములు రుజువు చేసుకుంటారు. స్వొంత తెలివి తేటలు వల్ల అందరినీ ఆకర్షించేదరు. నూతన వ్యవహారలాభం, ప్రయాణసౌఖ్యం, అధికారుల అనుగ్రహం, ఆదాయంవృద్ధి, శత్రువులపైఆధిక్యత, కుటుంబ సౌఖ్యం, గతంలో మీకు ఉన్న సమస్యలు పరిష్కారం, స్పెక్యులేషన్లో అనుకూలం లాభం.

జనవరి :- ఈనెలలో అన్నివిధాలుగా అనుకూలమే. చేయువృత్తి వ్యాపారాలందు లాభములు, ఆరోగ్యం బాగుంటుంది. ఆర్ధిక లావాదేవీలు సంతృప్తి, ధైర్యంగా పట్టుదలతో ముందుకు పోవుట, ఉద్యోగులకు అనుకూలం. నూతన వస్తు వస్త్ర ప్రాప్తి, చిరకాల మిత్రులను కలసుకుంటారు. బంధుమిత్రులను కలుసుకొంటారు.

ఫిబ్రవరి :- గ్రహసంచారం అనుకూలంగా ఉండుటచే అన్ని రంగముల వార్కి లాభమే. ఆదాయం బాగుండును. గృహంబులో శుభ కార్యములు, వాహనసౌఖ్యం, నూతనకార్యములకు శ్రీకారం చుట్టెదురు. అధికారుల సహకారం లభించును. శత్రువులపైఆధిక్యత. కుటుంబసంతోషాలు, స్పెక్యులేషన్లో లాభములుకలుగును.

మార్చి:- ఈ నెలలో చేయువృత్తివ్యాపారాలందు అనుకూలమే. గాని ఉద్రేకం, కోపంఉండుటవల్ల కార్యాలు ఆలస్యమగును. ఇతరులను బాధపెట్టే మాటలువల్ల బంధుమిత్రులతో విరోధములు శరీరగాయములు, వాహన ప్రమాదం, స్వల్పంగా ఇబ్బందులు, ఆదాయం బాగుంటుంది. సంతాన సౌఖ్యం, స్త్రీ మూలకలాభములు,. దైవసంబంధకార్యములలో పాల్గొంటారు. స్పెక్యులేషన్ లో మిశ్రమ ఫలితాలు.

Muhurth Fixing | Free Astrology

Astrology Consultation

1,050.002,625.00

Download Horoscope

Download Horoscope

525.001,050.00

Libra Rashiphal, Tula Rasi Phalalu, Tula Rasi Ugadi Rasi Phalalu, Ugadi Rasi Phalalu, Ugadi Rasi Phalalu 2024-25, Ugadi Rasiphalalu, What is the future of Tula Rasi, Yearly Prediction for Libra
ఉగాది వృశ్చిక రాశి ఫలితాలు – Vruschika Rasi Phalalu 2024-25
ఉగాది కన్యా రాశి ఫలితాలు – Kanya Rasi Phalalu 2024-25

Related Posts

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.