ఉగాది మీన రాశి ఫలితాలు – Meena Rasi Phalalu 2024-25

Loading

ఉగాది మీన రాశి ఫలితాలు - Meena Rasi Phalalu 2024-25

Poojalu. com శ్రేయోభిలాషులకు శుభాభినందనలు. ఇకపై గ్రూప్ ల ద్వారా కాకుండా నేరుగా నిత్య పంచాంగం, పూజా విధానాలు, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మిక సమాచారాలను పొందడానికి ఇప్పుడే మా WhatsApp Channel ను అనుసరించండి.

ఉగాది మీన రాశి ఫలితాలు 2024-2025

ఈ క్రోధి నామ సంవత్సరంలో మీన రాశి [Sri Krodhi Nama Samvatsara Meena Rasi Phalalu 2024-25] వారి యొక్క రాశి ఫలితాలు, ఆదాయ –  వ్యయములు, రాజపూజ్య – అవమానాలు, దోష సమయాలు, అనుకూలించే శుభసమయాలు, స్త్రీలకు ప్రత్యేకించి కలిసివచ్చే అంశాలు, చేసుకోవలసిన శాంతులు, నెలవారీగా ఉండేటువంటి శుభ విశేషాలు సంపూర్ణంగా ఇవ్వబడ్డాయి.

  •  ఆదాయం – 11, వ్యయం – 05 
  • రాజపూజ్యం – 02, అవమానం – 04

ఎవరెవరు మీనరాశి లోకి వస్తారు?

సాధారణంగా కింది నక్షత్రాలలో జన్మించిన వారు లేదా, కింది అక్షరాలను వారి పేర్లలో మొదటి అక్షరం గా కలిగిన వారు మీనరాశి లోకి వస్తారు.

  • పూర్వాభాద్ర 4వ పాదం (ది)
  • ఉత్తరాభాద్ర 1,2,3,4 పాదాలు(దు, శం, ఝ, థ)
  • రేవతి 1,2,3,4 పాదాలు (దే, దో, చ, చి)

శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది మీనరాశి ఫలాలు [Meena Rasi Phalalu 2024-25] ఈ కింది విధంగా ఉన్నాయి.

మీన రాశి ఫలాలు 2024-25

ఈ రాశి వారికి ఈ సంవత్సరములోగ్రహముల దోషకాలములు

  • రవి : 13-4-2024 వరకు జన్మం  15-6-2024 నుండి   16-7-2024 వరకు అర్దాష్టమం. 18-10-2024 నుండి   16-11-2024 వరకు అష్టమం . 12-2-2025 నుండి సం||  ఆఖరకు ద్వాదశం, జన్మం.
  • కుజుడు : సం॥రం ప్రారంభం నుండి 1-6-2024 వరకు ద్వాదశం, జన్మం. 28-8-2024 నుండి  19-10-2024 వరకు అష్టమం 9-2-2025 నుండి 28-3-2025 వరకు అర్దాష్టమం.
  •   గురుడు : ఈ సం॥ శుభుడే
  • శని : ఈ సం॥రం ఏల్నాటి శని
  • రాహువు, కేతువులు: జన్మం, సప్తమంలోఈ రాశి స్త్రీ పురుషాదులకు ధన, కుటుంబ జీవన కారకుడైన గురుడు 3వ ఇంటస్తంచారం. రాహువు కేతువుల అనుకూలసంచారం లేనందున మీకు స్వవిష యంలో ధైర్యంతక్కువ. ధనాదాయంలో అనేకరకాలుగా చేతికి వచ్చి మరుక్షణంలో మాయమగును. భార్యలేక స్త్రీమూలకంగానే మీజీవితం నిలపడును. శారీరకముగా నిరుత్సాహం. దిగులు ఔషధసేవలు చేయుట, నరఘోష ఎక్కువ. మీ వెనుకటి జీవనం తలచుకుంటే మీకు ఆశ్చర్యంగా ఉండును. మీ మంచితనం వల్ల ఇతరులు ఏది చెబితే అది నిజమని భావించుటచే చివరకు ఆర్ధిక చికాకులకు లోనగుట. ద్వితీయార్ధం నుండి యోగఫలాలు పట్టుదలచే కార్యాలు సాధిస్తారు. ఆరోగ్యం బాగుండి రాజదర్శనం, శరీరపోషణార్ధం ఇష్టకార్యసిద్ధి, కుటుంబ సౌఖ్యం ధన లాభాలు, సర్వతోముఖాభివృద్ధి, తీర్ధయాత్రాఫలప్రాప్తి, స్త్రీ సౌఖ్యములు, సంతాన సౌఖ్యం కలుగును. ప్రయాణాదులలో లాభాలు. భార్యా, పిల్లలు, కుటుంబముపై లోలోపల అధైర్యంచెందుట కలుగును. కొన్నిసందర్భాలలో శత్రువులే మిత్రుల గుట, పుణ్యక్షేత్రాది దివ్యసందర్శన భాగ్యంచే కొంతమనఃశ్శాంతిచేకూరును. ఎట్టి లోటుపాట్లు కలుగవు. గౌరవం నిలబెట్టుకొనుటకే వ్యయం. మొత్తం మీద అన్ని విధాలుగా అందరికీ ఈ సం॥ యోగదాయకంగా లాభదాయకంగా ఉండును.ఈ సం||రం ఉద్యోగులకు మంచి యోగకాలమని చెప్పవచ్చు. అనుకున్న పనులు సాధిస్తారు. మీ శ్రమకు తగినగుర్తింపులభించును. పై అధికారుల మన్నలు. పొంది ప్రమోషన్స్ పొందగలరు. గృహలాభం, జీవనసౌఖ్యం, లాభించును. కేంద్ర రాష్ట్రప్రభుత్వఉద్యోగులకు ఇంక్రిమెంట్లభించిఆదాయంపెరుగును. నిరుద్యోగులు ఉద్యోగాలుపొందిజీవితంలో స్థిరత్వంపొందగలరు. పర్మినెంట్ కానివారి పర్మినెంటు అగును. కాంట్రాక్టుగా పనిచేయువారికి స్థిరత్వం ఏర్పడును. ప్రవేటుకంపెనీ లలో పనిచేయువారు యజమానుల మన్ననలు పొంది కోరుకున్న ప్రదేశాలకు ప్రమోషన్తో కూడిన బదిలీలు జరుగును. మీ తెలివితేటలు వల్ల ప్రత్యేక గుర్తింపు.రాజకీయనాయకులకుకూడా మంచికాలమే. పెద్ద గ్రహములప్రభావం వలన ప్రజలలో అభిమానం సంపాదించుకొంటారు. సేవా కార్యక్రమాల్లో పేరువస్తుంది. అధిస్థానంవారు మీపనిని గుర్తించి ప్రభుత్వంలోనైనా పార్టీలోనైనా మంచి పదవులు నిలుస్తారు. ఎన్నికలందు పోటీచేసిన విజయం సాధించగలరు. అధిక ధనవ్యయం.

    కళాకారులకు అనుకూల సంవత్సరం మీ పేరు ప్రఖ్యాతులు పెరుగును. టి.వి,సినిమా రంగంలో ఉన్న నటీనటవర్ధం గాయనీ, గాయకులు ఇతర సాంకేతిక నిపుణులకు మంచివిజయాలు లభించి జీవితంలో స్తిరత్వం పొందగలరు. నూతన అవకాశములు బాగా వచ్చును. ప్రభుత్వ ప్రవేటు సంస్థల అవార్డ్సు లభించును.

    వ్యాపారస్థులకు కూడా చాలా యోగం పట్టిందల్లా బంగారమా? అనునట్లుండను. ఏవ్యాపారం ప్రారంభించినా రాణింతురు. ఆశించిన లాభాలు పొందగలరు. నూతన వ్యాపార ప్రారంభాలు చేస్తారు. హోల్సేల్ మరియు రిటైల్ వ్యాపారులకు అనుకూలమే. బంగారం, వెండి, ఇనుము, ఇటుక, ఇసుక, సిమ్మెంటు, కంకర, బిల్డింగె మెటిరీయల్స్ ్వర్కిమంచిలాభాలు, కాంట్రాక్టుదారులకు సరైన సమయంలో బిల్సు వచ్చుటచేలాభాలు. నూతన కాంట్రాక్టులు లభించును. షేర్ మార్కెట్లో ఉన్న వార్కి గతంలోపోగొట్టుకున్నదితిరిగి సంపాదించుకుంటారు. సరుకునిల్వ చేయువారికీ విశేషలాభాలు. రైసు మిల్లర్స్కు ప్రభుత్వ నిర్ణయాలు వల్ల ప్రతికూలత.

    విద్యార్ధులకు గ్రహబలం అనుకూలంగా ఉండుటచే జ్ఞాపకశక్తి బాగుండును. ఇతరవ్యాపకాలు లేకుండుటచే మంచి మార్కులతో ఉత్తీర్ణులై అందరి మన్ననలు పొందగలరు. ఇంజనీరింగ్, మెడికల్, లాసెట్, ఐసెట్, ఆసెట్, ఈసెట్, బి.ఇడి, పాలి టెక్నిక్ ఎంట్రన్స్పరీక్షలువ్రాయువారు మంచిర్యాంకులు, కోరిససీట్లనుపొందగలరు.

    వ్యవసాయదారులకు రెండు పంటలు దిగుబడి పెరిగి మంచి ధరవచ్చుటచే ఋణవిముక్తులగుదురు. గృహలాభాలు, శుభకార్యాలు చేస్తారు. కౌలుదార్లకు యోగించును. చేపలు, రొయ్యలు, చెరువులుచేయువార్కి గతసం||కంటేబాగుండును.

    స్త్రీలకు :- ఈ సం॥రం స్త్రీలకు మహోన్నతకాలం. అన్ని విషయాలలో మీదే పై చేయిగా ఉండును. మీ మాటకు విలువ, గౌరవం పెరుగును. బంధువులందరు మీ సలహాలు తీసుకుంటారు. కుటుంబంలో సఖ్యత, భార్యాభర్తలమధ్య అన్యోన్యత, సంతానసౌఖ్యం, తీర్ధయాత్రలు, నూతన వస్తు, వస్త్ర ప్రాప్తి, స్థిరాస్తులు ఏర్పడును. రక్తసంబంధమైన వ్యాధులువచ్చును. ఉద్యోగం చేయువార్కి ప్రమోషన్స్. వివాహం కాని వార్కి తప్పకుండా వివాహం జరుగును. గర్భిణీ స్త్రీలకు ఫ్రీ డెలివరీ. పుత్ర సంతాన ప్రాప్తి. గతంలో విడిగా ఉన్న భార్యాభర్తలు తిరిగి ఒక్కటి అగుదురు.

    మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు మంచి యోగదాయకమైన సం॥రం మీ పనికి తగ్గగుర్తింపు. తెలివి తేటలు సద్వినియోగపడును. జీవనలాభం, ఉత్సాహంగా, ఉల్లాసంగా కాలం గడుచును. గత సం||కంటే అనుకూలసమయం.

    చేయవలసిన శాంతులు:- ఈ సం॥రం నరఘోష అధికం. శని, మంగళవార నియమాలు,శివాలయాలలోరుద్రాభిషేకం, ప్రదక్షిణలుమంచిది, శ్రీశైలక్షేత్రదర్శనం, శనిగ్రహ,నరఘోష యంత్రాలు ధరించుట మంచిది.

    ఏప్రియల్:-చేయువృత్తివ్యాపారాలందు రాణింపుఉంటుంది. ఆర్ధిక లావాదేవీలు సంతృప్తి. ఆరోగ్యంబాగుండును. వ్యవహారములు మీకుఅనుకూలంగా సిద్ధించును. ఉల్లాసంగా, ఉత్సాహంగా పరాక్రమంతో ఉంటారు. బంధుమిత్రులతో సఖ్యత, సంతానం ద్వారా లాభాలు. వాహనసౌఖ్యం మార్పులు, స్పెక్యులేషన్ లాభములు.

    మే :- కుటుంబస్థానంలో గ్రహ సంచారం అనుకూలించును. చేయు ప్రయత్నాలు ఫలించును. అన్నింటా మీదే పైచేయి. మీమాటకుగౌరవం పెరుగును. మధ్యవర్తిత్వం చేయుదురు. ఆర్దిక సమస్యలు పరిష్కారమగును. వివాహాది శుభకార్యములకు హాజరగుదురు. నూతన పరిచయలాభం, స్త్రీ సౌఖ్యం, స్పెక్యులేషన్ లాభించును

    జూన్ :- అన్నిరంగాలందు అభివృద్ధి, వ్యవహారలాభములు, కుటుంబ సమస్యలు మబ్బువిడినట్లువిడిపోవుట, మనఃశ్శాంతి, ప్రశాంతవాతావరణం, బంధుమిత్రులతో కలయిక, వివాహాది శుభకార్యలాభములు. వాహన సౌఖ్యం, సంతాన సుఖం, భార్యాభర్తలమధ్య సరైన అవగాహనఉండును. స్పెక్యులేషన్ ఫర్వాలేదని పించును.

    జూలై:- చేయు వృత్తివ్యాపారములందు అనుకూలత, ప్రతీవిషయంలో మొండిగా, పట్టుదలతోకార్యాలుసాధిస్తారు. ఆర్థికంగా బాగుండును. గతంలోవేధిస్తున్న కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలించును. శత్రువులే మిత్రులై సహయ సహకారములు అందిస్తారు. నూతన పరిచయలాభములు, స్త్రీసౌఖ్యం, స్పెక్యులేషన్లాభించును. అపజయం. కార్యాలు ప్రారంభంలో నిలచిపోయిన చివరలోపూర్తి. ఆదాయం నకు మించినఖర్చులు, సమయానికి ఏదోలా ధనంచేతికందును. సంతాన సౌఖ్యం,

    ఆగష్టు:-ఈనెలలో శుభాశుభమిశ్రమఫలితాలు, కొన్నింటిలోజయం, కొన్నింటిలో కుటుంబ సౌఖ్యం, శుభకార్యలాభం, ప్రభుత్వ అధికారులను కలుసుకొనుట,

    సెప్టెంబర్:- ఈ నెలలోకూడా మిశ్రమ ఫలితాలే. ఆరోగ్యం బాగుండును. ఆదాయంనకు లోటుండదు. పనులు చివరి నిముషంలో సాధిస్తారు. భార్యతో చిన్న చిన్నగొడవలు,సౌఖ్యంతక్కువగాఉండును. సోదరవిరోధాలుతప్పవు. ఒక్కోసారి శారీరకబాధలుతప్పవు. నూతన పరిచయాలు. స్పెక్యులేషన్ ఫర్వాలేదని పించును.

    అక్టోబర్:- ఈ నెలలో ప్రథమార్ధం బాగుండదు. అనేక ఈతిబాధలు సమస్యలు బుద్ధిచాంచల్యం.మనోదుఃఖాలు, మనశ్శాంతిఉండదు. ప్రతిరోజుఏదోఒక సమస్య. ద్వితీయార్ధంలో కొంతమేరఅనుకూలించును. అనుకున్న పనులు సాధించెదరు. ఆదాయంబాగుండును. మిత్రసహకారంలభించును. స్పెక్యులేషన్లోనష్టాలుతప్పవు.

    నవంబర్ :-గ్రహాలఅనుకూలసంచారంవల్లచేయువృత్తివ్యాపారాలందురాణింపు ఆరోగ్యలాభం, వ్యవహారజయం, ఆర్ధిక లావాదేవీలు సంతృప్తి నిచ్చును. మిత్ర సంతోషాలు, పరాక్రమంతో ముందుకుపోగలరు. కుటుంబ సంతోషాదులు, తీర్ధ యాత్రఫలప్రాప్తి, సంతాన సౌఖ్యం, ప్రయాణ లాభాలు, స్పెక్యులేషన్ అనుకూలత.

    డిశంబర్:- గ్రహాలుఅనుకూలస్థితివల్ల అనుకూల వాతావరణం చేయు వృత్తి వాపారాలకు అనుకూలం. నూతనవ్యాపారప్రారంభాలు, వాహనసౌఖ్యం. సంతాన సుఖాలు, ఆరోగ్యంబాగుండును. ఎంతోకాలంగాఉన్నసమస్యలు మబ్బు తొలగి నట్లు తొలగిపోవును ప్రతి విషయంలో మీదే పైచేయి మీ మాటకు తిరుగుండదు. ఉద్యోగులకు స్థానచలనంతప్పదు. ప్రయాణలాభాలు, స్పెక్యులేషన్ బాగుండును.

    జనవరి :- ఈనెలలో కోపంపెరుగును. ప్రతీ చిన్న విషయానికి ఉద్రేకపడుదురు. శారీక గాయములు, కుటుంబములో మాటామాటా పట్టింపులు, అలసట, వ్యవ హార భంగములు, ఆర్ధికలావాదేవీలు బాగుండును. ఇతరుల వ్యవహారములో జోక్యం వల్ల నష్టపోవుదురు. భార్యతో కలహాలు, స్పెక్యులేషన్లో అనుకూలత.

    ఫిబ్రవరి :- ఈ నెలలో కూడా మానసిక సమస్యలుతప్పవు. మనఃశ్శాంతి ఉండదు. శారీరక సుఖంలోపించును. ఆరోగ్యభంగాలుతప్పవు. రక్తం కళ్ళచూస్తారు. వాహన ప్రమాదాలు, ప్రతిచిన్నవిషయానికి ఆందోళనకలత, సోదర మూలక విరోధములు, వ్యవహారభంగాలు, భార్యతో సరైన అవగాహన. స్పెక్యులేషన్లో మిశ్రమ ఫలితాలు.

    మార్చి:- ఈ నెలలో జన్మంలో అధిక గ్రహసంచారం వల్ల ఆరోగ్యం బాగుండదు. మనఃస్థిమితం ఉండదు. ఊహించని సమస్యలు ఎదుర్కొంటారు. పనులందు ఆటంకములు, విద్యార్థులు పరీక్షలు బాగానే వ్రాయుదురు. ధైర్యంగా ప్రజలలో ముందుకు వెళ్ళలేరు. పీడకలలు అధికంగా వచ్చును. జ్ఞాపకశక్తి బాగుంటుంది. బంధుమిత్రులతోకలహములు. అనుకోనిఖర్చు, గృహంలోమార్పులు, స్థానచలనం.

Newborn Baby Horoscope

Newborn Baby Horoscope

367.50

Download Horoscope

Download Horoscope

525.001,050.00

Meena Rasi Phalalu, Meena Rasi Ugadi Rasi Phalalu, Pisces Rashiphal, Ugadi Rasi Phalalu, Ugadi Rasi Phalalu 2024-25, Ugadi Rasiphalalu, What is the future of Meena Rasi, Yearly Prediction for Pisces
శ్రీ క్రోధి నామ సంవత్సర రాశి ఫలితాలు 2024 | Ugadi Rasi Phalalu 2024-25
ఉగాది కుంభ రాశి ఫలితాలు – Kumbha Rasi Phalalu 2024-25

Related Posts

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.