శ్రావణ మాసం | లక్ష్మీప్రదమైన మాసం – శ్రావణ మాస విశిష్టత | పండుగలు

Loading

https://www.panditforpooja.com/blog/wp-content/uploads/2016/07/significance-and-importance-of-rituals-in-sravana-masam.jpg

Poojalu. com శ్రేయోభిలాషులకు శుభాభినందనలు. ఇకపై గ్రూప్ ల ద్వారా కాకుండా నేరుగా నిత్య పంచాంగం, పూజా విధానాలు, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మిక సమాచారాలను పొందడానికి ఇప్పుడే మా WhatsApp Channel ను అనుసరించండి.

శ్రావణ మాసం:

లక్ష్మీ ప్రదమైన మాసం శ్రావణ మాసం.

స్థితికారుడు అయిన శ్రీమహావిష్ణువుకు, ఆయన దేవేరి అయిన శ్రీమహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైనది ఈ శ్రావణమాసం. అనేక రకములైన వ్రతములు, నోములు పూజలు ఆచరించడం వలన విశేష ఫలితాలను, సకల సౌభాగ్యాలను ప్రసాదించే దివ్యమైన మాసమే “శ్రావణ మాసం“.

చాంద్రమానం ప్రకారం తెలుగు మాసాలలో చైత్రం లగాయత్తు చూస్తే, శ్రావణమాసం ఐదవ మాసం. పూర్ణిమనాదడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉంటాడు కనుక దీనికి శ్రావణ మాసం అని పేరు. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం అయిన శ్రావణ నక్షత్రం పేరుతో ఏర్పడిన శ్రావణమాసంలో శ్రీమహావిష్ణువుకు చేసే పూజలు అనంత పుణ్యములను ఇస్తాయి.

శ్రావణమాసం మహిళలకు ఏంతో పవిత్రమైన మాసం. మహిళలు పాటించే వ్రతాలలన్నింటిలో ఎక్కువ వ్రతాలు ఈ మాసంలో ఉండడంవల్ల దీనిని వ్రతాలమాసమని, సౌభాగ్యాన్ని ప్రసాదించే మాసమని కూడా పేర్కొనబడింది.

https://www.poojalu.com//wp-content/uploads/2016/07/significance-and-importance-of-rituals-in-sravana-masam.jpg

శ్రావణ మాసంలో విశేష పర్వదినములు:

  1. మంగళగౌరీ వ్రతం
  2. వరలక్ష్మీ వ్రతం
  3. నాగచతుర్థి
  4. పుత్రదా ఏకాదశి
  5. రాఖీ పూర్ణిమ
  6. హయగ్రీవ జయంతి
  7. రాఘవేంద్ర జయంతి
  8. శ్రీ కృష్ణాష్టమి
  9. కామిక ఏకాదశి
  10. పోలాల అమావాస్య

మంగళగౌరీ వ్రతం:
శ్రావణ మాసం మందు ఆచరించ వలసిన వ్రతములలో మొదటిది ఈ మంగళగౌరీ వ్రతం. ఈ నెలలో వచ్చే నాలుగు మంగళవరాలు మంగళ గౌరీని పూజించాలి. పార్వతి దేవికి మరొక పేరు (గౌరీ ) మంగళ గౌరీ. సాధారణంగా కొత్తగా పెళ్ళయిన ముత్తైదువలు ఈ వ్రతాన్ని చేస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన ఐదవతనం కలకాలం నిలుస్తుందని ప్రతీతి. ఈ వ్రతాన్నిగురించి స్వయంగా శ్రీ కృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లు పురాణాలు పేర్కొన్నాయి.
ఈ వ్రత విదానం & వివరములకు క్లిక్ చేయండి —-> మంగళగౌరీ వ్రతం పూజ విధానం

వరలక్ష్మీ వ్రతం:
శ్రావణ మాసం లో మహిళలకు అతి ముఖ్యమైన ప్రధానమైన వ్రతం శ్రీ వరలక్ష్మీ వ్రతం. దీనిని పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం ఆచరింపవలెను. ఈ రోజున వరలక్ష్మీ దేవతను పూజిస్తే అష్టలక్ష్మీ పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పాలుపంచుకుంటారు. ఈ దేవతను పూజిస్తే అష్టైశ్వర్యాలు అయిన సంపద, భూమి, శిక్షణ, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం మరియు శక్తి వంటివి లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం.
ఈ వ్రత విదానం & వివరములకు క్లిక్ చేయండి —-> వరలక్ష్మీవ్రత వివరములు

శుక్లచవితి-నాగచతుర్థి:
దీపావళి తర్వాత జరుపుకొనే నాగులచవితి లాగ, మన రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలందు ఈరోజుని నాగులచవితి పండుగలా నాగాపుజలను చేస్తారు. రోజంతా ఉపవాసం ఉండి పుట్ట వద్దకు వెళ్ళి పాలు పోసి, నాగ దేవతను పూజిస్తారు. దుర్వాయుగ్మ వ్రతం చేయడానికి కుడా విశేషమైన రోజు ఈ శుక్ల చవితి.
ఈ పూజా విదానం & వివరములకు క్లిక్ చేయండి —-> నాగచతుర్థి వివరములు

శుక్ల ఏకాదశి-పుత్రదా ఏకాదశి:
శ్రావణశుద్ధ ఏకాదశిని పుత్రదా ఏకాదశి లేదా లలిత ఏకాదశి అంటారు. ఆరోజున గొడుగు దానమిస్తే విశేష ఫలితాన్ని పొందవచ్చు. పుత్ర సంతానాన్ని కోరుకొనేవారు ఈనాడు ఏకాదశీ వ్రతాన్ని ఆచరించడం మంచిది.

శ్రావణ పూర్ణిమ – రాఖీపూర్ణిమ:
అన్న/తమ్ముని శ్రేయస్సుని కోరుతూ అక్కాచెల్లెళ్ళు సోదరుని చేతికి రాఖీ కట్టే పండుగే ఈ రాఖీ పూర్ణిమ. సోదరునికి రాఖీ కట్టి, నుదుట బొట్టు పెట్టి అనంతరం మిఠాయిలను తినిపిస్తారు. సోదరుడు సోదరిని ఆశీర్వదించి కానుకలివ్వడం ఆనవాయితీ. ఈ రోజునే బ్రాహ్మణ, క్షత్రియ & వైశ్యులు తమ పాత యజ్ఞోపవీతాన్ని విసర్జించి కొత్తది ధరించడం ఆచారం. అందుచేత ఈ రోజుని జంధ్యాల పూర్ణిమ అనికూడా అంటారు.

పూర్ణిమ – హయగ్రీవ జయంతి:

ఈరోజునే శ్రీమహావిష్ణువు వేదాలను రక్షించేందుకు హయగ్రీవ రూపం ధరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. హయగ్రీవుడు జన్మించిన ఈ రోజుని హయగ్రీవ జయంతిగా జరుపుకొని, హయగ్రీవుడిని పూజించి శనగలు, ఉలవలతో గుగ్గిళ్ళు చేసి నైవేద్యం సమర్పించడం సర్వ శ్రేష్టం.
ఈ పూజా విదానం & వివరములకు క్లిక్ చేయండి —-> హయగ్రీవ పూజ వివరములు

కృష్ణవిదియ- శ్రీ రాఘవేంద్రస్వామి జయంతి:
మంత్రాలయంలో శ్రీ గురు రాఘవేంద్రస్వామి జయంతిని పురస్కరించుకొని విశేష పూజలను చేస్తారు. అంతే కాదు. క్రీ.శ.1671 వ సంవత్సరంలో విరోధికృత్ నామ సంవత్సర, శ్రావణ బహుళ విదియనాడు శ్రీ రాఘవేంద్రస్వామి వారు సజీవంగా సమాధిలో ప్రవేశించారని ప్రాచీన గ్రంధాలలో పేర్కొనబడినది.

కృష్ణపక్ష అష్టమి – శ్రీకృష్ణాష్టమి:
శ్రీమహావిష్ణువు యోక్క ఎనిమిదో అవతారమే శ్రీకృష్ణ అవతారం. శ్రీకృష్ణ పరమాత్మ జన్మించిన శుదినమే ఈ శ్రీకృష్ణాష్టమి. దీనినే జన్మాష్టమి అని కూడా పిలుస్తారు. ఈరోజు ఉదయం ఉపవాసం ఉండి సాయంత్రం కృష్ణుడిని పూజించి నైవేద్యంగా పాలు, పెరుగు, వెన్నలను సమర్పించడం అనంతరం ఉట్టిని కొట్టడం అనేది ఆచారంగా వస్తోంది.

కృష్ణపక్ష ఏకాదశి – కామిక ఏకాదశి:
ఇక బహుళ పక్షంలో వచ్చే ఏకాదశే కామిక ఏకాదశి. ఈరోజున నవనీతమును(వెన్న) దానం చేయాలని పెద్దలు అంటారు. తద్వారా ఈతి బాధలు పోయి, కోరికలన్నీ నెరవేరుతాయని శాస్త్ర వచనం.

కృష్ణపక్ష అమావాస్య – పోలాల అమావాస్య:
పోలాల అమావాస్యను మహిళలు శ్రావణ మాసములో కృష్ణపక్ష అమావాస్య రోజున జరుపుకుంటారు. సంతానాన్ని కోరుకునే ఇల్లాళ్లు దీనిని చేసుకోవాలని పెద్దలు చెబుతుంటారు. కాలక్రమేణా పోలాల అమావాస్య అన్న పేరు కాస్తా, పోలేరు అమావాస్య గా మారి,  పోలేరమ్మ అనే గ్రామ దేవతలను ఆరాధించే పర్వదినంగా మార్పు చెందింది. ఇది ఆచరించడం వల్ల పిల్లలకు అకాల మృత్యు భయం తొలగిపోతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి.
ఈ పూజా విదానం & వివరములకు క్లిక్ చేయండి —-> పోలాల అమావాస్య పూజ వివరములు

facts, festivals, god, hindu tradition, maha lakshmi, maha vishnu, pooja, sravana masam, పండుగలు, ముత్తయిదువ, లక్ష్మీ
వరలక్ష్మీ వ్రతకల్పము | వరలక్ష్మీ పూజ విధానం – శ్రావణ శుక్రవారం పూజ
Masa Sivarathri

Related Posts

Comments

3 Comments. Leave new

  • Thank u for the useful information – ramani rangudu

    Reply
  • Bhamidimukkula Ramesh
    17/08/2018 10:13

    శ్రావణమాసం గురించి మంచి వివరాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఇలాగే మిగతా మాసాలగురించి తెలియజేయండి

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.