Poojalu. com శ్రేయోభిలాషులకు శుభాభినందనలు. ఇకపై గ్రూప్ ల ద్వారా కాకుండా నేరుగా నిత్య పంచాంగం, పూజా విధానాలు, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మిక సమాచారాలను పొందడానికి ఇప్పుడే మా WhatsApp Channel ను అనుసరించండి.

కార్తీకమాసం లో వచ్చే శుక్లపక్ష నవమిని ‘అక్షయ నవమి‘ అని అంటారు. ఈ రోజున ‘అక్షయ నవమి’ వ్రతాన్ని ఆచరించిన వారి పుణ్యరాశి పెరిగి, సకల సంపదలు చేకూరతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. లోక కళ్యాణం కొరకు ‘కూష్మాండుడు‘ అని పిలువబడే రాక్షసుడిని శ్రీమహావిష్ణువు సంహరించిన రోజే ఈ అక్షయ నవమి. ఈ రోజునే ‘కృతయుగం‘ ఆరంభమైన రోజుగా ‘సత్యయుగాది’గా పేర్కొంటారు.
అంతే కాకుండా ఈ రోజునే రాక్షస సంహారానికి అమ్మవారు వివిధ రూపాలు ధరించడానికి నాంది అని కూడా చెప్తారు.
లక్ష్మీ నారాయణుల సన్నిధిలో విజయలక్ష్మిని లేక వీరలక్ష్మిని గాని నిలిపి, రావి, ఉసిరి, తులసి మొక్కలను ఉంచి పూజను చేయవలెను. ఈ విధంగా చేసే పూజను ‘జగద్ధాత్రి పూజ‘ అని పిలిచెదరు.
అక్షయ నవమి నాడు పఠించవలసిన స్తోత్రములు:-
విష్ణు విజయ స్తోత్రం
కనకధారా స్థవం
దుర్గా స్తోత్రం
లక్ష్మీ అష్టోత్తరం
నివేదనలు:- చక్కెర పొంగళి, దద్ధోజనం
పూజా ఫలితములు:- పాపరాశి ధ్వంసం, ధన లాభం, శత్రు నాశనం, అధికార ప్రాప్తి

Related
Related Posts
Comments
Related Posts
Recent Posts
- చంద్ర గ్రహణ సమయంలో చేసే జప సంకల్పం – అనుష్టాన సంకల్పం
- రథసప్తమి వ్రత విధానం | శ్రీ సూర్య నారాయణ స్వామి అష్టోత్తర పూజ
- 3వ తేదీ మార్చి 2026 చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత
- Today Panchangam 11/03/2026
- శ్రీ కాత్యాయని దేవి అష్టోత్తరం | Sri Katyayani Devi Ashtottaram
- దేవి నవరాత్రులలో నాలుగవ రోజు అలంకారం, నైవేద్యం, చదవవలసిన శ్లోకం
- చంద్ర గ్రహణం దోష పరిహార దానములు | చంద్ర గ్రహణ దాన సంకల్పం









