జూలై 27, 2018 సంపూర్ణ చంద్రగ్రహణ సమయాలు | చంద్ర గ్రహణం

జూలై 27, 2018 సంపూర్ణ చంద్రగ్రహణ సమయాలు | చంద్ర గ్రహణం

శ్రీ విళంబి నామ సంవత్సర ఆషాఢ శుక్ల పూర్ణిమ ది.. 27-07-2018 తేదీ శుక్రవారం కేతుగ్రస్త సంపూర్ణ చంద్ర గ్రహణం.

ది. 27వ తేదీ జూలై 2018 , శ్రీ విళంబినామ సంవత్సర ఆషాఢ శుక్ల పౌర్ణమి నాడు మకర రాశి యందు రాత్రి 11:54 ని నుండి తెల్లవారుఝామున 3:55 ని వరకూ సంపూర్ణ చంద్ర గ్రహణం (Total Lunar Eclipse July 2018) ఏర్పడును. ఈ గ్రహణం భారత దేశమంతటా కనిపించును. ఐతే ఈ సంపూర్ణ చంద్ర గ్రహణం ప్రారంభము తూర్పు ఆగ్నేయములందు స్పర్శను పొంది, వాయవ్యమందు నిమీలనమొంది, ఈశాన్యంలో ఉన్మీలనమై పశ్చిమమందు మోక్షము పొందును. కేతుగ్రస్త సంపూర్ణ చంద్ర గ్రహణం యొక్క వర్ణము పింగళ వర్ణము.

this year lunar eclipse full information

జూలై 27, 2018 సంపూర్ణ చంద్రగ్రహణ సమయాలు

చంద్రోదయకాలం(RJY): రాత్రి 6గంటల 20 నిముషములు (IST)
గ్రహణ స్పర్శకాలం: రాత్రి 11గంటల 54 నిముషములు (IST)
గ్రహణ నిమీలన కాలం: రాత్రి 12గంటల 59 నిముషములు (IST)
గ్రహణ మధ్య కాలం: రాత్రి 1గంటల 51 నిముషములు (IST)
గ్రహణ ఉన్మీలన కాలం: రాత్రి 2గంటల 43 నిముషములు (IST)
గ్రహణ మోక్ష కాలం: రాత్రి 3గంటల 49 నిముషములు (IST)
గ్రహణ పుణ్య కాలం 3గంటల 55 నిముషములు
బింబదర్శన కాలం 1గంట 44 నిముషములు
grahan, grahan kaal, lunar eclipse, precautions on eclipse
జూలై 27, 2018 సంపూర్ణ చంద్ర గ్రహణం ఏ రాశి వారికి యే ఫలితము ఇచ్చును?
యజ్ఞ్యోపవీతమును అసల ఎప్పుడెప్పుడు మార్చాలో తెలుసా?

Related Posts