ఉగాది మేష రాశి ఫలితాలు – Mesha Rasi Phalalu 2024-25

Loading

ఉగాది మేష రాశి ఫలితాలు - Mesha Rasi Phalalu 2024-25

Poojalu. com శ్రేయోభిలాషులకు శుభాభినందనలు. ఇకపై గ్రూప్ ల ద్వారా కాకుండా నేరుగా నిత్య పంచాంగం, పూజా విధానాలు, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మిక సమాచారాలను పొందడానికి ఇప్పుడే మా WhatsApp Channel ను అనుసరించండి.

ఉగాది మేష రాశి ఫలితాలు 2024-2025

ఈ క్రోధి నామ సంవత్సరంలో మేష రాశి [Sri Krodhi Nama Samvatsara Mesha Rasi Phalalu 2024-25] వారి యొక్క రాశి ఫలితాలు, ఆదాయ –  వ్యయములు, రాజపూజ్య – అవమానాలు, దోష సమయాలు, అనుకూలించే శుభసమయాలు, స్త్రీలకు ప్రత్యేకించి కలిసివచ్చే అంశాలు, చేసుకోవలసిన శాంతులు, నెలవారీగా ఉండేటువంటి శుభ విశేషాలు సంపూర్ణంగా ఇవ్వబడ్డాయి.

  • ఆదాయం – 08, వ్యయం – 14
  • రాజపూజ్యం – 04, అవమానం – 03

ఎవరెవరు మేషరాశి లోకి వస్తారు?

సాధారణంగా కింది నక్షత్రాలలో జన్మించిన వారు లేదా, కింది అక్షరాలను వారి పేర్లలో మొదటి అక్షరం గా కలిగిన వారు మేషరాశి లోకి వస్తారు.

  • అశ్విని 1, 2, 3, 4, పాదములు (చూ, చే, చో, లా)
  • భరణి 1, 2, 3, 4 పాదములు (లీ, లూ, లే, లో)
  • కృత్తిక 1వ పాదము (ఆ)

శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది మేషరాశి ఫలాలు [Mesha Rasi Phalalu 2024-25] ఈ కింది విధంగా ఉన్నాయి.

మేష రాశి ఫలాలు 2024-25

ఈ రాశి వారికి ఈ సంవత్సరములోగ్రహముల దోషకాలములు

  • రవి : సంవత్సరాది నుండి 14-5-2024 వరకు ద్వాదశం, జన్మం, 17-7-2024 నుండి 16-8-2024 వరకు అర్ధాష్టమం .17-11-2024 నుండి 15-12-2024 అష్టమం . 15-3-2025 నుండి  సం||రం ఆఖరు ద్వాదశం.
  • కుజుడు : 23-4-2024 నుండి 12-7-2024 వరకు ద్వాదశం. జన్మం 19-10-2024 నుండి 8-2-2025వరకు అర్ధాష్టమం.
  • గురుడు : ఈసం॥రం అంతాశుభుడే.
  • శని : ఈ సం॥రం అంతా శుభుడే. రాహువు : ఈ సం|| అంతా ద్వాదశం,
  • కేతువు : ఈ సం॥ అంతా శుభుడే.

ఈ రాశి స్త్రీ, పురుషాదులకు భాగ్య, వ్యయాధిపతి గురుడు ధనస్థానములో ఉండుట శని 11వ ఇంట బలీయంగా, రాహువు కేతువులు వ్యయం, షష్ఠములందు ఉన్నందువలన అన్నివిధములుగా యోచన చేయగా ఏ రకమైన జీవనము చేయువారికైనా ధనాదాయం బాగుండును. తమ అమూల్య కార్యముల పట్ల విజయం,.. వ్యవహారనిపుణత. యోచనాశక్తి, శత్రుమూలకముగా అనర్ధములు, సంవత్సర ప్రారంభంలో జరిగిన వ్యవహారములు అన్ని పరిష్కారమునకు వచ్చును. మొదటినెల కొంత అసంతృప్తిగా ఉన్నా, హోదా, గౌరవం గల వ్యక్తులు పరిచయము వలన గృహ జీవితానందము మంచి ప్రోత్సాహము కలుగును. ఏదోవిధంగా ధనము చేతికందును. ఎటువంటి లోటుపాట్లు కలగవు. ఎంత ఆదాయం వచ్చినా మంచినీళ్ళవలెఖర్చగును. చేతిలోసొమ్మునిలవదు. ఋణాలు చేయవలసి వచ్చును. తీర్ధయాత్రలుచేయుదురు. ఆప్తబంధుమిత్రుల మరణాలు కొంత బాధకలిగిం చును. కర్మలు కూడా చేయవలసివచ్చును. ఆకస్మికంగా, అనుకోకుండా దూర ప్రయాణాలు చేయవలసి వచ్చును. ఆరోగ్యం బాగుండును. గతంలో ఉన్న రోగాలుతగ్గును. సుఖమైన, ఆనందమైన జీవనం అనుభవించెదరు. సంతానంవల్ల సౌఖ్యం, గృహంలో వివాహాది శుభ కార్యములు తప్పక జరుగును. స్థలం కొనుట, లేదా గృహముకొనుట తప్పక జరుగును. గతంలో కొంత ఔన్నత్యమైన జీవితం అనుభవిస్తారు. ప్రభుత్వ సంబంధ కార్యములు రెండవ నెల నుండి పూర్తగును. ఈ సంవత్సరం ఉద్యోగులకు శనిబలం వలన ప్రమోషన్స్తో కూడిన బదిలీలు జరుగును. కోరుకున్న చోట్లకు బదిలీ జరుగును. కుటుంబంతో కలిసి ఉందురు. ఆర్ధికంగా నిలద్రొక్కుకుంటారు. కాని ఆదాయంనకు మించిన ఖర్చులు ఎదుర గును. పర్మినెంట్ కాని వార్కి పర్మినెంటు అగును. ఐ.టి ఉద్యోగులు అధికజీతంతో మరొక కంపెనీకి మారుదురు. ప్రవేటు రంగంలో ఉన్న చిరుద్యోగులకు తప్పనిసరిగా ఉద్యోగములు లభించును. గృహనిర్మాణములు కలసివచ్చును. ఈ సం॥రం రాజకీయ నాయకులకు శని బలం వలన చాలా బాగుంటుంది. ఎన్నికలలో పోటీచేసినట్లయిన విజయం పొందగలరు. ప్రజలలోనూ, అధిష్ఠాన వర్గములోను మంచి పేరు ఉంటుంది. ఖచ్చితంగా ఏదో ఒక పదవి పొంది అధీకారం అనుభవించెదరు. ఆర్ధికంగా మాత్రం కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.

స్త్రీలకు :- ఈ సం॥రం స్త్రీలకు చాలా బాగుంటుంది. అన్ని విధములుగా అనుకూ లేమే. మీ మాటకు విలువ పెరుగును. కుటుంబంలో అందరూ మీ మాటప్రకారం నడుచుకుంటారు. బంధుమిత్రులు మీ సలహాలు పాటింతురు. మీ పేరుతో విలువైన వస్తువులు లభించును. భార్యా భర్తలమధ్య సరైన అవగాహన ఉంటుంది. గతంలోని విడిగా ఉన్నవారు కలుస్తారు. పుట్టింటి వారి తరుఫున సూతకములు కలుగును. ఉద్యోగములు చేయు స్త్రీలకు ప్రమోషన్తో కూడిన బదిలీలు జరుగును. మొత్తంమీద ఈ రాశి స్త్రీ పురుషులకు మంచి యోగకాలముగా చెప్పవచ్చును. గురు, శనుల బలంబాగుంది. రాహువు వల్ల సూతకములు పితృ, మాతృ సోదర వర్గ అరిష్టములు కలుగును. జీవితంలో ఔన్నత్యములు కలుగును. కార్యలాభం.

చేయవలసిన శాంతులు:- 12వ ఇంట రాహువు సంచారం వల్ల మంగళవార. నియమాలు పాటించాలి. ఆరోజున మీ గ్రామంలో గల శివాలయంలో అభిషేకం చేయండి. రాహువుకు జపం, హోమం చేయించుకోండి శ్రీశైలక్షేత్ర సందర్శన మంచిది. నరఘోష,రాహువుగ్రహ యంత్రాలుధరించినమంచిది.

ఏప్రియల్:-ఈ నెలయందు వ్యయమందు, జన్మంలోనూ గ్రహసంచారం వలన జీవనంసాఫీగా ఉండదు. సమస్యలుఅనేకంఎదురగును. పనులందు ఆటంకములు, ఊహించని సంఘటనలు, ఆదాయంనకు మించిన ఖర్చులు. ఔషధసేవ తప్పదు చేయువృత్తివ్యాపారాలు అంతగా రాణించవు. ఇతరులను పరామర్మలు చేయుదురు.

మే :-ఈ నెలలో ఆర్దికసమస్యలువెంటాడును. ఋణాలుచేయవలసివచ్చును. ఇంట్లో ఉపయోగించు వస్తువులు రిపేరుకు వచ్చును. భార్యాభర్తలమధ్య చిన్నచిన్న తగా దాలు వచ్చి వెంటనే సమసిపోవును. సోదరవర్గం విరోధాలు, జాగ్రత్తగా యోచించి మసలుకోవాలి. ఆరోగ్యం బాగుంటుంది. పనులు త్వరితగతిని పూర్తి చేయలేరు.

జూన్ :- ఈ నెలలో గ్రహసంచారము అనుకూలముగానే ఉంది. అన్నిరంగముల వార్కియోగించును. విద్యార్ధులకు సంతోషము. ఉద్యోగులకు ప్రమోషన్స్, కుటుంబ సంతోషము, సంఘంలో ఉన్నత స్థితి, వ్యవహార జయం. రాజకీయనాయకులను, అధికారులనుకలుసుకుంటారు. తీర్ధయాత్రాఫలప్రాప్తి. ఆదాయంనకు లోటుండదు.

జూలై :- ఈనెలయందు మీమాటకు ఎదురుండదు. అన్నింటా విజయం. చేయు వృత్తివ్యాపారములందు రాణించెదరు. కుటుంబ వ్యక్తుల మధ్య సఖ్యత. అనురాగం పెరుగును. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది. వాహన సౌఖ్యం. నూతన పరిచయాలు. ప్రతీవిషయంలోను ధైర్యంగాముందుకు దూసుకు పోగలరు.

ఆగష్టు :- ఈ నెలలోకూడా అనుకూలగ్రహసంచారం వల్ల అన్నిరంగాల వార్కి లాభించును. ఆర్దికంగాబాగుంటుంది. ఆరోగ్యలాభం. మనోధైర్యం పెరుగును. మాతృ సౌఖ్యం. వాహనసౌఖ్యం, సంతానసౌఖ్యం, శత్రుపీడ నశించును. మాసాంతంలో స్వల్పంగా స్త్రీవిరోధాలు. అకారణంగా గొడవలు, అభివృద్ధికి ఆటంకాలు ఏర్పడును.

సెప్టెంబర్:- ఈనెలయందు చేయువృత్తివ్యాపారాలు అనుకూలించును. వ్యవహార జయము. ఆదాయంవృద్ధి,ఇతరులవిషయంలో జోక్యంచేసుకొనిమాటలు పడతారు. ప్రయాణాలందు ఆటంకాలు. 9. 3వ ఇంటికుజునివల్లకార్యలాభాలు. వ్యలాభాలు. స్త్రీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దైవసంబంధకార్యాలందు పాల్గొంటారు. సంతానసౌఖ్యం.

అక్టోబర్ :-ఈనెలయందు మిశ్రమఫలితాలుఇచ్చును. వ్యవహారాలందు నష్ట ములు, ఆర్దికసమస్యలు. కుటుంబతగాదాలు. స్త్రీమూలకంగావిరోధాలు. నమ్మిన వారి వలన దగాపడుట, ప్రయాణాల వలన ఇబ్బందులు. కార్యములు మధ్యలో నిలచిపోవును. భార్యాభర్తల మధ్య సరైన అవగాహనుండదు. దైవ సందర్శనములు. వ్యాపారములందు రాణించెదరు.

నవంబర్:- ఈనెల అనుకూలమే. చేయువృత్తి ఆర్ధికంగా బాగుండును. పుణ్యనదీ స్నానములు తీర్ధయాత్రా ఫలప్రాప్తి, వ్యవహార
జయం,సంతానసౌఖ్యం. నూతనకార్యాలకుశ్రీకారంచుట్టెదరు. ముఖ్య స్నేహితులు వలన సమస్యలు తీరును. సంతానంవల్లసౌఖ్యం. నూతన పరిచయములు స్త్రీ సౌఖ్యం:

డిశంబర్:- ఈ నెల గ్రహముల అనుకూల సంచారం వలన అన్నిరంగముల వార్కి చేయువృత్తివ్యాపారాలు కలిసివచ్చును. ఆర్ధికంగా బలపడుదురు. ధైర్యంతో ముందుకు పోగలరు. కుటుంబ సంతోషములు వాహన ప్రాప్తి. సంతానసౌఖ్యం. శత్రువులపైజయం, స్త్రీసౌఖ్యం భార్యాభర్తల మధ్య సరైన అవగాహన.సౌఖ్యము.

జనవరి :- అన్నివర్గాల వార్కి బాగుంటుంది. జీవనం సంతోషంతో ముందుకు సాగును. పాతమిత్రులను కలుసుకుంటారు. నూతన వాహన, వస్తు, వస్త్ర ప్రాప్తి, గృహోపకరణాలుక్రొత్తవికొంటారు. మిత్రులతో కలిసి విందులు, వినోదాలు, స్పెక్యు లేషన్లాభించును. ప్రయాణాలుకలిసివచ్చును. సంతానసౌఖ్యం, శత్రువులపైజయం. కుటుంబంలో సంతోషకర వార్తలు వింటారు. సమస్యలు పరిష్కారం అగును.

ఫిబ్రవరి :- ఈనెలలో మిశ్రమఫలితాలుంటాయి. ఆదాయంనకు మించిన ఖర్చులు చేయుదురు. స్త్రీమూలకంగా శుభమూలకంగా ఖర్చగును. గృహంలో రజస్వల, వివాహాది శుభకార్యాలులేదావాటికిహాజరగుదురు. నూతనకార్యాలకు శ్రీకారం చుట్టెదరు. నూతనపరిచయలాభం. అధికారులను, నాయకులను కలుసుకుంటారు.

మార్చి :- ఈ నెలలో పరిస్థితులు అనుకూలించవు. అధిక ధనవ్యయం, ఋణాలు కొద్దిగానైనా చేయుదురు. స్త్రీమూలకంగా విరోధములు. వ్యసనములు ద్వారా స్పెక్యులేషన్ ద్వారా నష్టములు. కళత్ర, పితృ మాతృవంశ పీడలు, సూతకములు, సంతానంపరీక్షలుబాగావ్రాయుదురు. ప్రయాణాలందు ఇబ్బందులు, వాహనాలకు రిపేర్లువచ్చుట, శత్రుమూలకంగా నష్టములు కార్యములు మధ్యలో నిలిచిపోవును.

Muhurth Fixing | Free Astrology

Astrology Consultation

1,000.002,500.00

Download Horoscope

Download Horoscope

500.001,000.00